Nithin Thammudu : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. రీసెంట్ గా రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకొని థియేటర్లలోకి వచ్చింది. కానీ మొదటి షోకే డీలా పడింది. ప్రస్తుతం తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ కావడంతో ఈ మూవీ పై నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ పై ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ మూవీ రిలీజ్ కి అడ్డం ఏర్పడిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం దిల్ రాజు అని ఇండస్ట్రీలో టాక్..అసలు దిల్ రాజు ఏం చేశాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
గేమ్ ఛేంజర్ నష్టాన్ని వెంకీ మూవీ తీర్చలేదా..?
ఈ ఏడాది దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మొదటగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ వచ్చింది. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన సోలో మూవీ.. తమిళ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ లో నిర్మించిన ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కూడా రాలేదని ఇండస్ట్రీలో టాక్. అయితే ఇదే బ్యానర్ పై విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కానీ గేమ్ ఛేంజర్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యలేదు. ఇప్పుడు నితిన్ తమ్ముడు మూవీ ఈ బ్యానర్ పైనే తెరకేక్కింది.. జూలై 4 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీని కొనడానికి డిస్టిబ్యూటర్స్ సిద్ధంగా లేరని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో కోడై కూస్తుంది.
తమ్ముడు మూవీకి డిస్టిబ్యూటర్స్ షాక్..
గతంలో వచ్చిన గేమ్ ఛేంజర్ వల్ల భారీగా డిస్టిబ్యూటర్స్ నష్టాన్ని చూశారు. ఇదే కాదు దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన కొన్ని సినిమాలు నష్టాన్ని కలిగించాయని, వాటిని భర్తీ చేసిన తర్వాతే ఈ సినిమాను కొంటామని అంటున్నారని ఇన్ సైడ్ వర్గాల్లో టాక్. ముందు అది చెల్లిస్తే తమ్ముడు సినిమాను కొనుగోలు చేస్తామని దిల్ రాజు నెట్ వర్క్ లో ఉన్న డిస్టిబ్యూటర్స్ మొండికేసి కూర్చున్నారు. ఆల్రెడీ గేమ్ ఛేంజర్ వల్ల భారీ నష్టాన్ని చవిచూసిన దిల్ రాజుకు ఇది ములుగుతున్న నక్కపై ముంజ పడ్డట్లు అయ్యింది. ఎటు తేల్చుకోలేని పరిస్థితి.. ఒకవేళ వాళ్లు అడిగినట్లు డబ్బులు చెల్లించి సినిమాను రిలీజ్ చేసినా సక్సెస్ అవుతుందని చెప్పలేని పరిస్థితి.. ఎందుకంటే గతంలో నితిన్ తో చేసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఎటు చూసిన నితిన్ తమ్ముడు మూవీకి అడ్డంకులే ఉన్నాయి. ఇక ఏ నిర్ణయం అయినా కూడా దిల్ రాజు చేతిలోనే ఉంది. నితిన్ అయితే ఈ మూవీ హిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.. చూడాలి ఏం జరుగుతుందో..