LSG VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… గురువారం రోజున లక్నో వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన లక్నో సూపర్ జెంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై ఏకంగా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్. ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన లక్నో.. తన పరువు కోసం ఆడుతోంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో… సరికొత్త సంఘటన జరిగింది. ఈ మ్యాచ్లో దిగ్విష్ దూరం కాగా… అతని స్థానంలో ఆకాష్ మహారాజ్ సింగ్ అనే కొత్త బౌలర్ తెరపైకి వచ్చాడు. అతను కూడా నోట్ బుక్ సిగ్నేచర్ సెలబ్రేషన్ చేసి.. నిన్నటి మ్యాచ్ లో రచ్చ చేశాడు.
Also Read: LSG VS GT: దిగ్వేశ్ పోయాడు.. లక్నోలో మరొకడు తగిలాడు..నోట్ బుక్ సిగ్నచర్ సెలెబ్రేషన్స్ చేస్తూ
దిగ్వేష్ పోయాడు… ఇప్పుడు మరొకడు తగ్గిలాడు
లక్నో సూపర్ జెంట్స్ జట్టులో.. స్పిన్నర్ దిగ్వేష్ గురించి తెలియని వారు ఉండరు. వికెట్ తీసాడు అంటే చాలు కచ్చితంగా నోట్ బుక్ సిగ్నేచర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. అయితే మొన్న హైదరాబాద్ మ్యాచ్లో అభిషేక్ శర్మను గెలవడంతో… ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో తాజాగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ లో దిగ్వేష్ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఆకాష్ మహారాజు సింగ్ జట్టులోకి వచ్చాడు. అయితే.. ఈ ఆకాష్ సింగ్ కూడా… నోట్బుక్ సిగ్నేచర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోష్ బట్లర్ వికెట్ ను తీశాడు ఆకాష్. 33 పరుగుల వద్ద జోష్ బట్లర్ ను అవుట్ చేశాడు. దీంతో దిగ్వేష్ తరహాలోనే సెలబ్రేషన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు ఆకాష్ సింగ్. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దారుణంగా ఓడిన గుజరాత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన లక్నో సూపర్ జెంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 33 పరుగులు తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టును చిత్తు చేసింది లక్నో సూపర్ జెంట్స్. వాస్తవానికి నిన్నటి మ్యాచ్లో లక్నో గెలిచినా, ఓడినా పెద్ద ఫరక్ పడకపోయేది. కానీ గుజరాత్ కు మాత్రం పెద్ద బొక్కే పడింది. నిన్న గెలిచి అగ్రస్థానంలో అలాగే కొనసాగాలని గుజరాత్ భావించింది. ఒకవేళ ఇవాళ జరిగే హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో.. RCB విజయం సాధిస్తే నెంబర్ వన్ కు వెళ్తుంది. అప్పుడు గుజరాత్ టైటాన్స్ కు కొత్త సమస్యలు వస్తాయి
Also Read: IPL players :పంజాబ్ దరిద్రాన్ని ఢిల్లీకి పట్టించారా.. ఈ 4 గురు ప్లేయర్లు అడుగుపెడితే సర్వనాశనమేనా..?
Bro banned, but his celebration made the XI. pic.twitter.com/TtL6SbTKxC
— Out Of Context Cricket (@GemsOfCricket) May 22, 2025