E-Paper
Advertisement

Divvela Madhuri: చిక్కుల్లో పడ్డ దివ్వెల మాధురి.. రూల్స్ అతిక్రమిస్తూ!

Divvela Madhuri: చిక్కుల్లో పడ్డ దివ్వెల మాధురి.. రూల్స్ అతిక్రమిస్తూ!
Advertisement

Divvela Madhuri: సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి(Divvela Madhuri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్(Bigg Boss) లోకి అడుగు పెట్టింది దివ్వెల మాధురి . అక్కడ తనదైన శైలిలో పెర్ఫార్మన్స్ ఇచ్చి కొంతమంది చేత విమర్శలు కూడా ఎదుర్కొంది.. అలాంటి ఈమె ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడింది. ఏకంగా ఏడుకొండలపై గెస్ట్ హౌస్ లో బిగ్ బాస్ తనూజ (Thanuja) బర్తడే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

మళ్లీ చిక్కుల్లో పడ్డ దువ్వాడ మాధురి..

పూర్తి వివరాలలోకి వెళితే.. తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్లడం నిషిద్ధం.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా మాధురి కొండపైకి బర్తడే కేకును ఎలా తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై టిటిడి విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది.. అంతకుముందు వీరే తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా చిక్కుల్లో పడ్డారు దువ్వాడ శ్రీనివాస్. మాడవీధుల్లో దివ్వెల మాధురి , దువ్వాడ శ్రీనివాస్ దంపతులు రీల్స్ వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేశారు. ఇందుకు సంబంధించి మాధురిపై కేసు కూడా ఫైల్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్ బిగ్ బాస్ రన్నర్ తనూజ కోసం బర్తడే కేక్ తెప్పించి మరీ కట్ చేయించింది. అంతేకాదు తనుజాకి బంగారు చెవి దిద్దులు, గాజులతోపాటు చీరను బహుమతిగా అందించింది.

తనూజ పుట్టినరోజు సెలబ్రేషన్స్..

Advertisement

ఇక పుట్టినరోజు సందర్భంగా తనూజ బర్తడే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోని దివ్వెల మాధురి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” హ్యాపీ బర్తడే బంగారం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు.. నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగి వచ్చావు. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను” అంటూ తనుజాకి శుభాకాంక్షలు తెలియజేసింది. పైగా ఈ పోస్ట్ కి తనూజ కూడా స్పందిస్తూ..” థాంక్యూ మ్యాడీ” అంటూ రిప్లై ఇచ్చింది .ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదంలో చిక్కుకుంది మాధురి. మరి ఈ విషయం నుండి మాధురి ఎలా బయటపడుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వాలు విధించిన రూల్స్ ని అతిక్రమిస్తూ ఇలా బర్తడే విషెస్ జరుపుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై దువ్వాడ శ్రీనివాస్ , దువ్వాడ మాధురి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ALSO READ:Sankranti 2027: నందమూరి వార్ తప్పదా? అనిల్ భలే స్కెచ్ వేసారే?

తనూజ – మాధురి రిలేషన్..

Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తనూజ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన మాధురిని అమ్మ అని పిలుస్తూ తనలో తన తల్లిని చూసుకుంటున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది .అలా తల్లి కూతుర్లుగా హౌస్ లో నానా హంగామా చేశారు. ఇక ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోరు. కానీ వీరు ఇంకా ఆ థాట్ నుండి బయటకు రాలేదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×