BigTV English

Neha Bamb: అయ్యా బాబోయ్.. దిల్ బ్యూటీ గుర్తుందా.. ఎలా మారిపోయిందో చూడండి

Neha Bamb: అయ్యా బాబోయ్.. దిల్ బ్యూటీ గుర్తుందా.. ఎలా మారిపోయిందో చూడండి

Neha Bamb: హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి దిల్. ఈ సినిమా తరువాతనే నిర్మాత రాజు పేరు.. దిల్ రాజుగా మారింది. నితిన్, నేహా బాంబ్ జంటగా నటించిన ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత నితిన్ స్టార్ గా మారాడు.


ఇక నేహా కూడా అబ్బాయిల కలలరాణిగా మారింది. ఆ సమయంలో ఈ చిన్నది.. వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకున్నారు. కానీ, నేహాకు అవకాశాలు మాత్రం దక్కలేదు. దిల్ తరువాత.. నేహా జగపతి బాబు సరసన అతడే ఒక సైన్యం సినిమాలో నటించింది. నా పాట తేట తెలుగు పాట అనే సాంగ్ తో ఆమె మరింత గుర్తింపు అందుకుంది. ఇప్పటికీ ఈ సాంగ్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.

ఇక ఈ రెండు సినిమాలే అమ్మడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు అని చెప్పాలి. వీటి తరువాత చిన్న చిన్న పాత్రల్లో బొమ్మరిల్లు, దుబాయ్ శీను లాంటి సినిమాల్లో కనిపించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త రిషిరాజ్ ఝావేరిని వివాహమాడి ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి తరువాత నేహా ఎక్కడా కనిపించలేదు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచుతూ ఇంటికే పరిమితమయ్యింది.


ఇక సోషల్ మీడియా వచ్చాకా.. సినిమాల్లో కనిపించకపోయినా.. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. నిత్యం తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక నేహా పెళ్లి తరువాత పూర్తిగా మారిపోయింది. అలా అని నేహా అందంగా లేదా అంటే అది కాదు. ముఖం కొద్దిగా మారినా.. ఆమె తన శరీరాకృతిని కాపాడుకుంటూనే వస్తుంది. నేహాను చూసిన వారెవ్వరు ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అని అనుకోరు అంటే అతిశయోక్తి కాదు. మరి నేహా ముందు ముందు ఏమైనా రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×