BigTV English

Devara Movie: దేవరలో ‘చుట్టమల్లే’ పాట పాడిన శిల్పారావు ఎవరో తెలుసా..?

Devara Movie: దేవరలో ‘చుట్టమల్లే’ పాట పాడిన శిల్పారావు ఎవరో తెలుసా..?

Do You Know ShilpaRao Who Sing The Song Chuttamalle In Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ నెగిటివ్ రోల్‌ పోశిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ కొట్టిన అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఆడియెన్స్‌లో అంచనాలన్నీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి. దానికి తోడు ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన ఎన్టీఆర్ లుక్స్, టీజర్, ఫియర్ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.


ఇక ఆ హైప్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చుట్టమల్లే సాంగ్ రూపంలో మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. రొమాంటిక్ మెలోడిగా వచ్చిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాటలో ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ గ్లామర్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ అద్భుతమైన పాటను అంతే అద్భుతంగా ఆలపించిన సింగర్ శిల్పారావు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సింగర్ శిల్పారావు అచ్చమైన మన తెలుగుమ్మాయి. ఆమె 1984లో జన్మించారు. ఆమె తండ్రి వెంకట్రావు. ఆయన ఉద్యోగ రీత్యా కుటుంబం అంతా జార్ఖాండ్ లోని జంషెడ్ పూర్లో సెటిల్ అయ్యారు. అయితే తండ్రి వెంకట్రావుకి ముందునుండి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే ఆయన మ్యూజిక్ లో డిగ్రీ చేశారు. దాంతో తండ్రిబాటలోనే ఆమె కూడా మ్యూజిక్ నేర్చుకున్నారు. శిల్పారావు తెలుగమ్మాయి అయినప్పటికీ ముందుగా బాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన వార్ సినిమాలో గుంగూ పాటతో ఒక్కసారిగా ఫెమస్ అయ్యారు ఆమె.

Also Read: కొత్త సిరీస్‌తో దుమ్ములేపడానికి నటి తమన్నా రెడీ


తరువాత వరుసగా పఠాన్ లో బేషరం రంగ్, జైలర్ సినిమాలో కావాలయ్యా వంటి పాటలు పాడి యూట్యూబ్ ను షేక్ చేశారు శిల్పారావు. కావాలయ్యా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో, రీల్స్ లో, షార్ట్స్ లో ఎక్కడ చూసినా ఆ పాటె కనిపించేది, వినిపించేది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో ‘ఓ మైబేబీ’ పాటను కూడా శిల్పరావు పాడారు. ఇప్పుడు లేటెస్ట్ గా దేవర సినిమాలో తన మ్యాజికల్ గొంతుతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు శిల్పరావు. చుట్టమల్లే అంటూ సాగిన ఈ పాట కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ముందుముందు కూడా ఆమె మరిన్ని పాటలు పాడి మనల్ని ఇలాగే అలరించాలని కోరుకుందాం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×