BigTV English

Bangladesh: బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం.. రేపు ప్రమాణస్వీకారం

Bangladesh: బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం.. రేపు ప్రమాణస్వీకారం

Bangladesh new PM news(Telugu news live): బంగ్లాదేశ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా, ఆ తర్వాత అల్లర్లుగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియాలో అడుగుపెట్టారు. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ ఆందోళనకారులు బలంగా వినిపించారు. షేక్ హసీనా విధించిన కర్ఫ్యూను అమలు చేయడానికి అప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ కూడా ముందుకు రాలేదనే కొన్ని వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా వెళ్లిపోయాక రాష్ట్రపతి మొహమ్మద్ షాహాబుద్దీన్ పార్లమెంటను రద్దు చేశారు. మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహించాలని నోబెల్ అవార్డు గ్రహీత యూనస్‌ను ప్రధానిగా రాష్ట్రపతి ప్రకటించారు. రేపు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రధానిగా యూనస్, మంత్రి మండలి సభ్యులు ప్రమాణం చేయనున్నారు.


బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ ఈ మేరకు బుధవారం వెల్లడించారు. రేపు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ప్రమాణం తీసుకునే అవకాశం ఉన్నదని జనరల్ వాకర్ తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దేశాన్ని ప్రజాస్వామిక ప్రక్రియ గుండా తీసుకెళ్లడానికి ఆయన రెడీగా ఉన్నారని జనరల్ వాకర్ చెప్పారు. ఈ పని చేయడానికి ఆయన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మన దేశాన్ని సుందరమైన ప్రజాస్వామిక ప్రక్రియ గుండా తీసుకెళ్లుతాడనడంలో సందేహం లేదని వివరించారు. యూనస్ కూడా ఇదే భావాన్ని వెల్లడించారు.

Also Read: Vinesh Phogat: వినేష్ అనర్హతలో రాజకీయ కుట్ర ఉందా?


బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళన షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసే వరకు సాగింది. ఆ కోటాను బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం కుదించినప్పటికీ ఆందోళనలు ఆగలేవు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×