E-Paper
Advertisement

Suriya: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. సూర్య జీవితాన్నే మార్చిసింది.. ఏ సినిమానో తెలుసా.. ?

Suriya: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. సూర్య జీవితాన్నే మార్చిసింది.. ఏ సినిమానో తెలుసా.. ?
Advertisement

Suriya: సినిమా.. ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరు ఎప్పుడు స్టార్ గా మారతారు అనేది చెప్పడం కష్టం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు రాసి పెట్టి ఉంటుంది. ఎవరు ఎప్పుడు సక్సెస్ అవ్వాలన్నది దేవుడు ముందే నిర్ణయిస్తాడు. అలానే ఏ సినిమాతో ఒక హీరో స్టార్ డమ్ ను దక్కించుకోవాలో కూడా ముందే రాసి పెట్టి ఉంచుతాడు. అందుకే కథ రాసేటప్పుడు ఏ హీరోను అనుకున్నా.. రాతలో రాసి ఉన్నవారితోనే ఆ సినిమాలు తెరకెక్కుతాయి.. హిట్స్ అందుకుంటాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..ఒక హీరో.. 12 మంది హీరోలు వద్దు అన్న కథను ఎంచుకొని స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు. అతడే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తమిళ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సూర్యకు ఏఆర్ మురగదాస్.. గజినీ కథను చెప్పుకొచ్చాడు. కథ నచ్చడంతో సూర్య కూడా ఓకే చేశాడు. కానీ, అప్పుడు ఆయనకు తెలియని విషయం ఏంటంటే అదే కథను 12 మంది హీరోలు రిజెక్ట్ చేశారు అని.. అవును మీరు వింటున్నది నిజమే.

Advertisement

గజినీ సినిమాను బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు 12 మంది రిజెక్ట్ చేశారు. అందులో రజినీకాంత్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, విజయ్ కాంత్ తో పాటు మరో ఐదుగురు హీరోలు ఉన్నారు. ఈ విషయాన్నీ మురగదాస్ నే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట గజినీ కథను.. స్టార్ హీరోలందరికీ వినిపించాను. కొంతమంది వద్దు అన్నారు.

పవన్, మహేష్.. ఒంటినిండా పచ్చ బొట్లు పొడిపించుకోవాలి అనగానే మాకు సెట్ అవ్వదు అని చెప్పేసారు. అలా వీరందరి తరువాత 13 వ హీరోగా గజినీ సూర్య వద్దకు వెళ్లి ఆగింది అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సంజయ్ రామస్వామిగా సూర్య పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. . ఇప్పటికీ సూర్యను చాలామంది సంజయ్ రామస్వామి అనే పిలుస్తారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేసాడు. ఇక్కడ కూడా గజినీ రికార్డు కలక్షన్స్ తో అదరగొట్టింది. తెలుగువారికి సూర్యను పరిచయం చేసింది. అలా సూర్య జీవితాన్నే గజినీ మార్చేసింది.

Advertisement

ఇక ఈ సినిమా తరువాత సూర్య చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ కావడం మొదలయ్యింది. ప్రస్తుతం సూర్య తమిళ్ లో ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇకపోతే సూర్య చేతిలో ప్రజెంట్ రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కంగువ షూటింగ్ జరుపుకుంటుండగా.. కార్తీక్ సుబ్బరాజు చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×