E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును రామ్మూర్తి సేఫ్ గా హైదరాబాద్ తీసుకొస్తాడా..?        

Nindu Noorella Saavasam Serial Today Episode October 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును రామ్మూర్తి సేఫ్ గా హైదరాబాద్ తీసుకొస్తాడా..?        
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  అంజు గురించి తనకు తెలిసిన నిజం వైజయంతి అమర్‌కు చెప్తుంది. అమర్‌ నిజమేనని తనకు ముందే తెలుసని చెప్తాడు. ఇంకా అంజు సొంత తల్లి ఎవరనేది నీకు తెలుసా..? అని అమర్‌ను అడిగితే.. లేదని చెప్తాడు అమర్‌. భాగీకి తెలిసి ఉండొచ్చా అని వైజయంతి అడిగితే.. తనకు తెలియదని చెప్తాడు అమర్‌. భాగీ ఎక్కడుందని వైజయంతి అడిగితే.. గుడికి వెళ్లిందని అమర్‌ చెప్తాడు. వెంటనే వైజయంతి గుడి దగ్గరకు వెళ్తుంది.

గుడి దగ్గరకు వెళ్లిన వైజయంతి అంజు, మనోహరి, రణవీర్‌ల గురించి చెప్పి.. నీకు అసలు నిజం తెలిసి ఉండొచ్చు అయినా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తుంది. అందుకు రాథోడ్‌ సమాధానం చెప్తాడు. అమర్‌ సార్‌ కోసం నిప్పులాంటి నిజాలను గుండెల్లో దాచుకుందని ఎమోషనల్ అవుతాడు. మిస్సమ్మ మౌనంగా ఉండటానికి గల కారణాలు మొత్తం రాథోడ్‌ చెప్పగానే.. వైజయంతి చలించిపోతుంది. అప్పుడే వైజయంతికి కులుమనాలిలో ఉన్న పోలీసులు ఫోన్‌ చేస్తారు. కాల్ లిఫ్ట్‌ చేసి పార్తు అడ్రస్‌ దొరికిందా అని అడుగుతుంద.

Advertisement

పార్థు సార్‌ ఉన్న చోటికి తాము చేరుకున్నామని కానీ అక్కడ పార్థు లేడని చెప్తారు. అదేంటని వైజయంతి అడిగితే.. పార్థు సార్‌ ఎక్కడికో వెళ్లిపోయారట. అని పైగా పార్థు సార్‌ గతం మర్చిపోయారని చెప్తారు. దీంతో వైజయంతి బాధగా ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఏమైంది మేడం పార్థు సార్ అడ్రస్‌ తెలిసిందా..? అని మిస్సమ్మ అడిగితే.. తెలిసింది పార్థు బతికే ఉన్నాడట అని చెప్తుంది. వైజయంతి ఆ మాట చెప్పగానే.. మిస్సమ్మ, రాథోడ్‌ ఫుల్లు సంతోషిస్తారు. అంతలోనే వైజయంతి బాధగా పార్థు అక్కడ లేడట పైగా పార్థు గతం మర్చిపోయాడట అని చెప్తుంది. రాథోడ్‌, మిస్సమ్మ షాక్‌ అవుతారు.

కులుమనాలిలో రోడ్ల మీద పిచ్చొడిలా తిరుగుతుంటాడు పార్థు. అప్పుడే తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోతున్న రామ్మూర్తి వాళ్ల బస్సు కింద పడబోతాడు పార్థు. అందరూ వెళ్లి చూసి పార్థు తెలుగు వాడేనని తెలుసుకుని పార్థు కండీషన్‌ను గమనించిన రామ్మూర్తి తమతో పాటు హైదరాబాద్‌ రమ్మని బస్సులో ఎక్కించుకుని వెళ్తారు.

Advertisement

గుడిలో వైజయంతి చెప్పిన పార్థు గతం మర్చిపోయాడన్న మాట తలుచుకుని రాథోడ్‌, మిస్సమ్మ బాధపడుతుంటారు. అచ్చం మా సారుకు జరిగినట్టే జరిగింది. మా సార్‌క కూడా యాక్సిడెంట్‌ అయ్యాక గతం మర్చిపోయారు. ఇప్పటకీ సారుకు కొన్ని విషయాలు అసలు గుర్తు ఉండవు అంటే అందుకే మనోహరి బతికిపోయింది. లేదంటే అరుంధతి చావుకు కారణం మనోహరేనని.. పైగా రణవీర్ వైఫ్‌ తనే.. అంజు తల్లి తనే అన్న నిజాలు తెలిశాక అమర్‌ కోపంలో మనోహరిని చంపేసేవాడు.. లేదంటే జైళ్లో వేయించేవాడు. అంత పెద్ద ప్రమాదం నుంచి పార్థు బయటపడ్డందుకు సంతోషించాలో.. లేక గతం మర్చిపోయి పిచ్చోడిలా రోడ్లు మీద ఏ దిక్కుకు వెళ్లాలో తెలియక అయోమయస్థితిలో ఉన్న పార్థు చూసి బాధపడాలో అర్థం కావడం లేదు అంటూ వైజయంతి ఎమోషనల్‌ అవుతుంటే..

మిస్సమ్మ, రాథడ్‌ ఇద్దరూ వైజయంతిని ఓదారుస్తారు. బాధపడకండి మేడం పార్థు గారిని బతికించిన ఆ దేవుడే తనను క్షేమంగా మన దగ్గరకు పంపిస్తాడు అంటుంది. రాథోడ్‌ కూడా అవును మేడం పార్థు సార్‌ తప్పకుండా ఇక్కడకు వస్తారు అంటాడు. కులుమనాలి నుంచి బస్సులో వస్తున్న రామ్మూర్తి, మిస్సమ్మకు ఫోన్‌ చేస్తాడు. ఫోన్‌ లిఫ్ట్ చేసిన మిస్సమ్మ.. నాన్న ఎక్కడ ఉన్నారు..? అన్ని తీర్థయాత్రలు చూసొచ్చారా..? అని అడుగుతుంది.. అన్ని చూసుకుని హైదరాబాద్‌ బయలుదేరామని రామ్మూర్తి చెప్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

గాజులు గలగల పాటతో ఫేమస్..రాధమ్మ కూతురు వర్సెస్ కళ్యాణమ్మ

టెంపర్ సీన్ ని ఇంతలా కాపీ కొట్టాలా.. జగదాత్రి సీరియల్‌పై ట్రోల్స్!

నన్ను చూసిన ప్రతి మగాడు చెమటలు కక్కుతున్నారు.. శ్రీముఖి బోల్డ్ కామెంట్స్!

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×