BigTV English

Actress Gayatri: నాగమ్మ సీరియల్ లో నాగమ్మగా మెప్పించిన ఈ చిన్నది గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

Actress Gayatri: నాగమ్మ సీరియల్ లో నాగమ్మగా మెప్పించిన ఈ చిన్నది గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

Actress Gayatri: ఇప్పుడంటే హార్రర్ సినిమాలను లైట్ తీసుకుంటున్నారు కానీ, అప్పట్లో నాగమ్మ సీరియల్ వస్తుంది అంటే అందరు గుండెలు గుభేల్ మనేవి. ఆ పెద్ద పాము, వెనుక ఆ సౌండ్స్.. గ్రాఫిక్స్ చూస్తూ అప్పట్లో ఆడో లోకం అనుకోనేవారు. పిల్లలు భయపడుతూ కూడా నాగమ్మ సీరియల్ ను చూసేవారు. జెమిని టీవీలో ప్రతి ఆదివారం రాత్రి నాగమ్మ సీరియల్ చూడకుండా అప్పట్లో నిద్రపోయేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.


ఇప్పుడు సీరియల్స్ లో సీనియర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న నీరజ, శ్రీనివాస్.. ఈ సీరియల్ తోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శంకరాభరణం సోమయాజులు నటించిన సీరియల్.. ఇందులో బాలనాగమ్మగా బాలనటి గాయత్రీ నటించింది. చారడేసి కళ్ళకు.. నిండా కాటుక పెట్టి.. నుదుటున పెద్ద బొట్టు పెట్టి.. ఆమె పాము మీద కూర్చొని కనిపిస్తే అంతే సంగతులు.. టీవీలకు హారతులు కూడా ఇచ్చేవారు.

ఇక ఈ సీరియల్ ద్వారా గాయత్రీ మంచి గుర్తింపును తెచ్చుకుంది. నాగమ్మ సీరియల్ చేసే సమయానికి గాయత్రీ వయసు 15 ఉంటుంది. ఇక దీంతో ఈ సీరియల్ తరువాత ఆమె హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. 2007 లో సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ కోటి హీరోగా పరిచయం చేస్తూ నోట్ బుక్ అనే సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ చందు. ఆ సినిమాలో గాయత్రీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


నందిని పాత్రలో గాయత్రీ నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. నోట్ బుక్ తరువాత గాయత్రీకి మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ, ఆమెకు అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్ లో అడుగుపెట్టింది. అక్కడ అందాల ఆరబోత చేస్తే ఛాన్సెస్ ఇస్తారనుకొని హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.

చిన్న చిన్న పాత్రలు, వ్యాంప్ క్యారెక్టర్స్ లాంటివి వచ్చినా కాదనకుండా చేసింది. ఆ తరువాత అలాంటి క్యారెక్టర్స్ కూడా రాకపోవడంతో ఆమె సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు గాయత్రీ ఎక్కడ ఉంది.. ? ఏం చేస్తుంది.. ? అనేది ఎవరికి తెలియదు. కొంతమంది మాత్రం ఆమె పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు. తెలుగులోనే చిన్న చిన్న పాత్రలు చేసుకొంటూ ఉన్నా గాయత్రీ ఇప్పుడు మంచి నటిగా ఉండేదని.. కోలీవుడ్ కు వెళ్లి ఆమె జీవితాన్ని నాశనం చేసుకుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×