E-Paper
Advertisement

AP Elections: గరివిడి, గుర్ల ZPTC లు వైసీపీ కైవసం.. బొత్స అనూష గ్రౌండ్ వర్కేనా?

AP Elections: గరివిడి, గుర్ల ZPTC లు వైసీపీ కైవసం.. బొత్స అనూష గ్రౌండ్ వర్కేనా?
Advertisement

AP Local Elections: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అధిపత్యం ప్రదర్శించినప్పటికీ విజయనగరం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కూటమి.. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమి ప్రభంజనం వీస్తున్న వేళ.. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలా నిలబడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కీలక స్థానాల్లో పోటీ, ఫలితాలు
ముఖ్యంగా గరివిడి జెడ్పీటీసీ స్థానంలో ప్రముఖ నేతల కుటుంబాల మధ్య పోరు సాగింది. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య అధికార పార్టీ టీడీపీ నుంచి బరిలో దిగగా.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత వైసీపీ నుంచి పోటీ చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే పూజిత తిరుగులేని లీడ్‌తో దూసుకుపోయి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Advertisement

అంతేకాకుండా గరివిడి మండలంలోని మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను సైతం వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని మండల పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత గడ్డపైనే ఆయన కోడలిని ఓడించి మండలాన్ని కైవసం చేసుకోవడం కళా వెంకట్రావుకు తీరని ఎదురుదెబ్బగా మిగిలింది. మరోవైపు గరివిడి మండలంలోని మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను సైతం వైసీపీ కైవసం చేసుకోవడం విశేషం.

గుర్ల జెడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి కూటమి అభ్యర్థిపై విజయం సాధించారు. దీనితో పాటు గుర్ల మండల పరిషత్ స్థానాన్ని కూడా వైసీపీ సొంతం చేసుకుంది. బొండపల్లి గజపతినగరం పరిధిలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో హోరాహోరీ పోరు జరిగగా.. వైసీపీ తరఫున డాక్టర్ బొత్స అనూష పోటీ చేయగా, అధికార కూటమి మద్దతుదారుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. పలు రాజకీయ సమీకరణాలు, తీవ్ర ఒత్తిళ్ల మధ్య జరిగిన ఈ పోరులో అనూష స్వల్ప తేడాతో ఓడిపోయారు.

Related News

‘సర్’ పై వ్యూహాత్మక మౌనం ! బీఆర్‌ఎస్ సైలెంట్ మోడ్‌..! ఆ మౌనం వెనుక మతలబేమిటీ…? పైగా ప్రతిపక్షంపైనే విమర్శల దాడి!

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?

బీజేపీని గెలిపించడం కచ్చితంగా ప్రజల తప్పేనట! భావోద్వేగాలకు లొంగితే ఇలాంటి సీఎంలే వస్తారన్న పీకే! బీహార్‌ సీఎంపై ట్రోలింగ్స్‌..!

కరువు నేపథ్యంలో సర్కార్ పై బీఆర్‌ఎస్‌ పంజా! మరింత ఇరకాటంలో పెట్టేలా వ్యూహాలు! రైతు భరోసాతో రాజకీయం!

నాలుగేళ్ల తరువాత మనసు మార్చుకున్న మోడీ! ఆరేళ్ల సర్వీసు.. పర్మినెంట్‌కు అవకాశం.. అయినా..?

పాఠశాలల్లో మౌళిక సదుపాయాలపై పోరాట బాట పడుతున్న జనరేషన్‌ అల్ఫా! ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల కరువు.. సమస్యేదైనా పోరాటంతోనే పరిష్కారమని భావించి!

మోడీని డిఫెన్స్‌లో పడేసిన ‘ఫారెన్‌ లింక్‌’ అస్త్రం! ధీటుగా సవాల్‌ విసిరి దేశ వ్యాప్త చర్చకు తెరలేపిన రాహుల్‌! మోడీ ఒకటి తలిస్తే..!

Big Stories

Advertisement
×