BigTV English

Sarada: ఈ సీనియర్ నటిని గుర్తుపట్టారా.. ప్రభాస్ కు తల్లిగా కూడా నటించింది

Sarada: ఈ సీనియర్ నటిని గుర్తుపట్టారా.. ప్రభాస్ కు తల్లిగా కూడా నటించింది

Sarada: సాధారణంగా సీనియర్ హీరోలు అంటే టక్కున ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు అని చెప్పేస్తాం. కానీ, హీరోయిన్స్ లో చెప్పమంటే మాత్రం అబ్బో పెద్ద లిస్ట్ నే ఉంది. ఒకరా.. ఇద్దరా.. ? అప్పట్లో అందం, అభినయంతో నటించి మెప్పించిన హీరోయిన్లు ఎంతోమంది. అందులో శారద ఒకరు. అచ్చతెలుగు అందం శారద అసలు పేరు సరస్వతి. ఆమె పుట్టింది తెలుగు అయినా మలయాళంలో మొదట ఎంట్రీ ఇచ్చింది. అక్కడనుంచి తెలుగుకు పరిచయమైంది.


ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా శారద ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన రక్త‌క‌న్నీరు సినిమాకు మంచి గుర్తింపు వ‌చ్చింది.శారద కెరీర్ లో ఉత్తమ నటిగా మూడు జాతీయ అవార్డులను అందుకుంది. 1968లో విడుద‌లైన‌ మలయాళ చిత్రం తులాభారంలో శార‌ద న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకుంది. ఇక ఆమె ఖ్యాతి అన్ని వైపులా పాకింది. దీంతో టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేసి పిలిచింది.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా తెలుగులో స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించి మెప్పించింది. అంతేనా ఒకపక్క తెలుగులో చేస్తూనే ఇంకోపక్క మలయాళంలో కూడా నటిస్తూ వచ్చింది. 1972లో విడుద‌లైన స్వ‌యం వ‌రం అనే మలయాళ సినిమాలో న‌ట‌న‌కు శార‌ద‌కు రెండోసారి జాతీయ అవార్డు ల‌భించింది. ఇక తెలుగు సినిమా నిమ‌జ్జ‌నంలో న‌ట‌న‌కు 1977లో మూడోసారి శార‌ద ఉత్త‌మన‌టిగా జాతీయ అవార్డు పొందింది. ఇప్పుడంటే నేషనల్ అవార్డు అనేస్తున్నాం కానీ, అప్పట్లో ఈ అవార్డును ఊర్వశి అని సంబోధించేవారు. అప్పటినుంచి ఆమె పేరు ‘ఊర్వ‌శి’ శార‌ద గా మారింది.


ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన శారద నటుడు చ‌లాన్ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే చలానికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇక కొంతకాలం బావున్నా వీరి కాపురంలో కలతలు రావడంతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది.

ఇక శారద 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచింది. ఆ తరువాత ఆమె కాంగ్రెస్ లో చేరింది. అప్పుడు సినిమాలకు దూరమైన శారద.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

సంక్రాంతి, స్టాలిన్, ఆట, యోగి, సుకుమారుడు లాంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా యోగిలో ప్రభాస్ తల్లిగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఏ నోము నోచిందో.. ఏ పూజ చేసిందో అంటూ సాగే తల్లి సాంగ్ ఇప్పటికీ ఎక్కడో చోట సినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం శారద వయస్సు 78. వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది.

Tags

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×