E-Paper
Advertisement

Double Ismart: డబుల్ డోస్‌ పెంచిన డబుల్ ఇస్మార్ట్

Double Ismart: డబుల్ డోస్‌ పెంచిన డబుల్ ఇస్మార్ట్
Advertisement

Double Ismart with Double Dose: సెన్సేషనల్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, హీరో రామ్‌ కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ టాలీవుడ్ ఆడియెన్స్‌లో హైప్‌ని పెంచుతున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఆడియెన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 15న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్‌ భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు మరో రెండు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అందులో హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో హీరో రవితేజ యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ కాగా, విక్రమ్ హీరోగా నటించిన తంగళన్ మూవీ ఉంది.

అలాగే నార్నీ నితిన్ యాక్ట్ చేసిన ఆయ్ మూవీ ఆగష్టు 16న అంటే ఒక్కరోజు లేట్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ఇదిలా ఉంటే.. పరిస్థితులు ఎలా ఉన్నా డబుల్ ఇస్మార్ట్‌కి మాత్రం కొన్ని పరిస్థితులు కలిసి వచ్చేలా లేవు. ఎందుకంటే.. గతంలో పూరీ తీసిన లైగర్ నష్టానికి సంబంధించి ఒక పెద్ద పంచాయతీ నడుస్తోంది. అనేక మీటింగ్‌లు జరిపినా సరే ఈ ఇష్యూకి సొల్యూషన్ కరువైంది. దీంతో ఈ నెల 15 నుంచి థియేటర్‌లు బంద్ చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. ఇక ఇదే విషయమై మూవీ యూనిట్ రియాక్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ రిలీజ్‌ని ఆపేదేలే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదంటూ తేల్చి చెప్పేశారు. అదంతా పుకార్లు అని, వాటిని ఎవ్వరు కూడా పట్టించుకోవద్దని కరాఖండిగా చెప్పేశారు మూవీ యూనిట్.

Advertisement

Also Read: రొమాంటిక్ మోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తగ్గేదేలే అంటోన్న జాన్వీకపూర్‌

అయితే ఈ మూవీని ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ ఏం మాత్రం లేట్ చేయకుండా సిద్ధంగా ఉండండి అంటూ మూవీ యూనిట్ పేర్కొన్నారు. అలాగే ఆగష్టు 11న ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ని హన్మకొండ జిల్లాలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఈవెంట్‌కి ఎవరిని పిలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి డార్లింగ్ ప్రభాస్ వస్తాడని కొందరు, మరికొందరు ఎన్టీఆర్ అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా డబుల్ ఇస్మార్ట్‌తో టాలీవుడ్‌లో మరోసారి హైప్ రావడం మాత్రం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×