BigTV English

Chandrababu: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Telangana TDP: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. టీ టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ అధ్యక్ష ఎన్నిక గురించి కామెంట్ చేశారు. తెలంగాణలో టీడీపీని క్షేత్రస్థాయిలో నుంచి బలోపేతం చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామంలో టీడీపీ జెండా రెపరెపలాడాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తామని వివరించారు. అప్పుడే అధ్యక్ష ఎంపిక ఉంటుందని తెలిపారు.


తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయడానికి తాను సమయం కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వెల్లడించారు. ప్రతి నెల రెండో శనివారం తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులతో సమావేశం అవుతానని వివరించారు. ఈ మేరకు ఆయన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. టీడీపీ తెలంగాణలోనే పుట్టిందని చంద్రబాాబు నాయుడు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ఈ పార్టీ పుట్టిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలిసి ముందుకు వెళ్లుతామని చెప్పారు. మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 15 నుంచి 20 రోజుల్లో గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ తర్వాతే కొత్త కమిటీలు వేద్దామని వివరించారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలని, తెలుగు జాతి బాగుండాలనేదే తన ఆశయం అని చెప్పారు. గతంలో తెలంగాణను అభివృద్ధి చేశామని, ఇకపైనా తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.


Also Read: White Ration Cards: కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వనున్నారంటే..? వారికి ఉండాల్సిన అర్హతలివే..

టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు టీ టీడీపీకి అధ్యక్షులు లేరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేయాలని కాసాని బలంగా అనుకున్నారు. నాయకులంతా సిద్ధమయ్యారు. కానీ, ఏపీలో చంద్రబాబు నాయుడు ఆ సమయంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు రాజమండ్రీ జైలుకు వెళ్లారు. ఆ సమయంలోనే కాసాని జ్ఞానేశ్వర్ ఈ విషయంపై చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ టీడీపీ పోటీ చేస్తుందా? అనే దానిపై స్పష్టత కోసం భేటీ కాగా.. చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ టీడీపీ పోటీ చేయదని స్పష్టం చేశారు. దీంతో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఆయన సమక్షంలోనే కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తారనే చర్చ మొదలైంది. అందుకు తగినట్టుగానే చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఏపీలో అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తాజాగా రెండో సారి సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.

Tags

Related News

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

AP Govt updates: రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంట కొనుగోలుకు రేటు ఫిక్స్.. మీరు సిద్ధమేనా!

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

MP Avinashreddy: అవినాష్‌రెడ్డికి గడ్కరీ సర్‌ ప్రైజ్.. ఆ పార్టీల మధ్య ఏం జరుగుతోంది?

Big Stories

×