BigTV English
Advertisement

Devara Song: రొమాంటిక్ మోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తగ్గేదేలే అంటోన్న జాన్వీకపూర్‌

Devara Song: రొమాంటిక్ మోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తగ్గేదేలే అంటోన్న జాన్వీకపూర్‌

Janvi Kapoor Entry Into The Romantic Mode Of Can’t Control Of Himself: విశ్వ బ్యూటీ శ్రీదేవి, హీరో బోణీ కపూర్‌ గారాల కూతురు బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన అందచందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. మెయిన్‌గా టాలీవుడ్ కుర్రాళ్లను అట్రాక్ట్‌ చేయడం కోసం బాగా కసరత్తులు చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడీ భామ టాలీవుడ్‌లో దేవర మూవీతో టాలీవుడ్‌లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అసలు సిసలైన పల్లెటూరి పిల్లగా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయనుంది. తన యాక్టింగ్‌తో పాటుగా తన గ్లామర్ డోస్‌తో ఆడియెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్దమవుతోంది.


తాజాగా దేవర మూవీ నుంచి చుట్టమల్లె అనే ఓ రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేయగా… ఈ సాంగ్‌ విజువల్‌ వండర్‌గా రికార్డులు బ్రేక్ చేసేందుకు దగ్గరగా ఉంది. ఇందులో ఈ భామ తన అందాలను ఆరబోసి మరీ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసింది.ఇక తన అంద చందాలతో కుర్రకారును తెగ ఆకట్టుకుంది. ఈ సాంగ్‌ రిలీజై రోజులు గడుస్తున్నా యూత్ మాత్రం ఆ సాంగ్‌ను మరిచిపోయేందుకు అస్సలు ఇష్టపడట్లేదు. ఇప్పటివరకు కొన్ని మిలియన్లకు పైగా వ్యూస్‌ను ఈ సాంగ్‌ సొంతం చేసుకుంది.అంతేకాకుండా యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఈ సాంగ్‌ మానియాని అలాగే కంటిన్యూ చేస్తోంది. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. జాన్వీ కూడా ఈ సాంగ్‌కు స్లోగా అడిక్ట్‌ అయిపోయిందట. ఈ విషయాన్ని జాన్వీనే స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి తన పాటను తానే లైక్ చేస్తోంది. ఈ సాంగ్‌ హిందీ వెర్షన్‌కు ఓ రీల్ చేసి వదిలింది. ఇక ఈ రీల్‌లో జాన్వీ తన అందంతో ఫ్యాన్స్ గుండెల్ని చుట్టేస్తోంది అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్ చేస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్ గట్టిగానే ప్లాన్ చేశాడట, ఎందుకంటే..!


ఇందులో జాన్వీ గౌన్‌ ధరించి ఎంతో కూల్‌గా, అందంగా అలరించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ సాంగ్ గురించి జాన్వీ మాట్లాడుతూ.. చుట్టమల్ సాంగ్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ ఎంతో ఆనందంగా అనిపిస్తోందని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సాంగ్‌ విషయంలో నాపై నెగెటివ్‌ ట్రోల్స్‌ రాలేదు కాబట్టి, ఇది కూడా ఎంతో సంతోషానిచ్చింది. నా డ్యాన్స్‌తో పాటు ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ ప్రతి ఒక్కరికీ నచ్చిందని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సాంగ్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చేస్తున్న రీల్స్‌ను జాన్వీ రోజూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ వారిని అలరిస్తోంది. కాగా దేవర మూవీని వచ్చే నెల 27న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఈ మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×