Movie Artist Hulchul :ట్రెండ్ పేరిట అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఏ రేంజ్ లో ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే వీరి ప్రవర్తన చూసేవారికి అసభ్యకరంగా మారిందని కూడా చెప్పవచ్చు.నిన్న మొన్నటి వరకు కొంతమంది మగవారు తప్ప తాగి నడిరోడ్డు పైన తైతక్కలాడిన సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ఆర్టిస్ట్ తప్పతాగి నడిరోడ్డుపై తైతక్కలాడుతూ.. చూసేవారికి ఆశ్చర్యంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా కలిగించిందని చూసినవారు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అంతటితో ఆగకుండా ఆమె ఏకంగా మహిళా హోంగార్డుపై దాడి చేసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించింది. మరి ఈమె ఎవరు..? అసలు ఏం జరిగింది? అసలు విషయం ఏమిటో? ఇప్పుడు చూద్దాం..
తప్పతాగి నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన లేడీ ఆర్టిస్ట్..
మూవీ ఆర్టిస్టు మేకల సరిత (Mekala Sarita) మద్యం మత్తులో నడిరోడ్డుపై చిందులేసింది. తాగి, ఊగి రోడ్డుపైనే తైతక్కలాడింది. మధుర నగర్ లోని మెయిన్ రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించింది. మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్భాషలాడింది. అంతేకాదు అటుగా వెళ్లే వారిని కూడా వదలకుండా విరుచుకుపడింది అటు పోలీసులు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా.. వారి విధులను ఆటంకం కలిగించింది. ముఖ్యంగా న్యూసెన్స్ సృష్టించి వీరంగం చేసింది. ఇక ఈమెను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన మహిళా హోంగార్డుపై కూడా దాడి చేసింది. ఇక నడిరోడ్డుపై ఈమె సృష్టిస్తున్న వీరంగానికి విసిగిపోయిన పోలీసులు ఆమె భర్త రాజేష్ కు ఫోన్ చేసి, పిలిపించి మరీ ఆమెను అప్పగించారు
మందు భామను ఆమె భర్తకు అప్పగించిన పోలీసులు..
మద్యం మత్తులో వీరంగం చేస్తున్న ఆమెను వెంటనే ఇంటికి తీసుకువెళ్లాలని భర్త రాజేష్ కు సూచించారు. అంతేకాదు మధురానగర్ పోలీసులు మూవీ ఆర్టిస్టు సరితపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు సరిత రోడ్డుపై వాహనదారులను అటు పోలీసులను ఇబ్బంది పెట్టిన తీరుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన చాలామంది ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న మందు భామ అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
మద్యం మత్తులో మూవీ ఆర్టిస్ట్ హల్చల్..
మధురా నగర్ మెయిన్ రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించిన సరిత
మైకంలో మహిళా హోంగార్డుపై దాడి
చరణ్ అనే వ్యక్తి సహా అటుగా వెళ్తున్న వారిని దుర్భాషలాడుతూ వీరంగం
సరిత భర్త రాజేష్ కు ఫోన్ చేసి పిలిపించి అప్పగించిన పోలీసులు
సరితపై కేసు నమోదు pic.twitter.com/jbJQCQzCsL
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025