Daggubati with Chandrababu: రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడు అనుకోని వ్యక్తులు సమావేశం కావడం సహజం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరిగింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సీఎం చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య ప్రస్తుతం రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఆదివారం రాత్రి అమరావతి వచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇరువురు తోడల్లుళ్ళు కావడంతో కాసేపు రాజకీయాలను పక్కన పెట్టేశారు. వివిధ అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తాను రచించిన‘ఆది నుంచి నేటి వరకు’పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
మార్చి ఆరున విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
గతంలో వీరిద్దరు కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకున్నారు. కాకపోతే చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో రాజకీయంగా ఏమైనా చర్చలు జరిగాయంటూ చర్చించుకోవడం మిగత పార్టీల వంతైంది.
ALSO READ: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం
చంద్రబాబు-దగ్గుబాటి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇరువురు తోడల్లుళ్లు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒకరు లెప్ట్.. మరొకరు రైట్‌గా ఉండేవారు. వివిధ సంఘాలను చంద్రబాబు చూసేవారు. అభ్యర్థుల ఎంపికను దగ్గుబాటికి అప్పగించారు. ఆనాడు దగ్గుబాటి ఎంపిక చేసిన నేతలు ఇప్పుడు వివిధ పార్టీల్లో నేతలుగా రాణిస్తున్నారు కూడా.
ఆనాడు టీడీపీ క్రైసిస్‌ను ఇరువురు నేతలు తమ భుజాలపై మోశారు. పార్టీని గట్టెక్కించారు. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడుగా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. రాజకీయాలకు దూరమయ్యారు దగ్గుబాటి. అయితే వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లినప్పటికీ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేదు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత చంద్రబాబు ఇంటికి దగ్గుబాటి రావడంతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కనిపించారు. చాన్నాళ్లు తర్వాత ఈ కలయిక చూశామని కొందరు సీనియర్లు చెబుతున్నారు.
3 దశాబ్దాలు తర్వాత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలయిక
తను రచించిన "ప్రపంచ చరిత్ర" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తోడల్లుడిని ఆహ్వానించిన దగ్గుబాటి
చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఆహ్వానం pic.twitter.com/HKeuvgkroo
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025