BigTV English

Vastu Tips: మీరు నివసించే ఇల్లు శుభప్రదమైనదా.. కాదా? ఈ రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు

Vastu Tips: మీరు నివసించే ఇల్లు శుభప్రదమైనదా.. కాదా? ఈ రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు

మనిషి జీవితంలో ఇల్లు ఎంతో ముఖ్యమైనది. బయట ఎన్ని పనులు చేసి అలసిపోయినా ఇంటికి వచ్చాక హాయిగా, సంతోషంగా అనిపించాలి. కానీ కొన్ని ఇళ్లు అలా ఉండవు. ఇంటికి రాగానే చిరాగ్గా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. సొంత ఇంట్లో ఉన్నా కూడా బయట ఉన్నట్టే అనిపిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తులు ప్రశాంతంగా జీవించలేరు. అలాగే కొన్ని ఇల్లు దిగగానే ఆర్థికంగా నష్టం కలిగిస్తాయి. ఆ ఇంట్లో ఏదీ మంచి జరగకపోవచ్చు. కాబట్టి ఒక ఇల్లు అద్దెకి తీసుకునే ముందు లేదా కొనేముందు రెండు పద్ధతుల్లో ఆ ఇల్లు మంచిదో కాదో తెలుసుకోవచ్చు.


ఇంటి వాస్తు చిట్కాలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు చక్కగా ఉంటేనే ఆ ఇంట్లో వారు సంతోషంగా జీవించగలుగుతారు. అప్పుడే వారికి అదృష్టం దక్కుతుంది. ప్రశాంతత కలుగుతుంది. వారు ఆ ఇంట్లో నివసించడం వల్ల ఆనందం, శ్రేయస్సు దక్కుతాయి. అలాంటి ఇంటిని ఎంపిక చేసుకోవాలి. వాస్తు శాస్త్ర ప్రకారం ఒక ఇల్లు మంచిదో కాదో తెలుసుకోవడానికి రెండు చిట్కాలు ఉన్నాయి. ఈ రెండింటినీ పాటించడం ద్వారా మీరు ఆ ఇంట్లో ఉండాలా? వద్దా? అన్నది తెలుసుకోవచ్చు.

తులసి మొక్కతో
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం తులసి మొక్క శుభప్రదమైనది. మీరు ఏ ఇంటినైతే అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారో లేక కొనుక్కోవాలని అనుకుంటున్నారో… ఆ ఇంట్లో ఒక తులసి మొక్కను కుండీతో సహా పెట్టండి. ప్రతిరోజూ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా నీరు పోయండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ మొక్క ఎదగకుండా ఎండిపోతే ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం చేసుకోండి. తులసి మొక్క పెరుగుదలను అడ్డుకునేది ఆ ప్రతికూల శక్తి అని అర్థం చేసుకోండి. ఆ ఇల్లు మీకు నివసించడానికి తగినది కాదని వాస్తు చెబుతోంది. ఒక ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే అందులో ఉన్న మనుషుల ప్రశాంతంగా జీవించలేరు. ఎన్నో ఇబ్బందులు పడతారు. అనుకున్న పనులు సరిగా జరగవు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి ఇంటిని తీసుకోకపోవడమే ఉత్తమం.


మందార మొక్క
ఇల్లు శుభప్రదమైనదా? కాదా? తెలుసుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది. మీరు తీసుకోవాలంటున్న ఇంటికి దగ్గరలో నర్సరీ కి వెళ్ళండి. అక్కడ తెల్ల మందార మొక్కను కొనండి. ఆ మొక్కకు కచ్చితంగా పువ్వులు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ మొక్కను తీసుకొచ్చి ఇంట్లో ఉంచండి. ఎక్కడైతే స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి ఉంటుందో అక్కడ పెట్టండి. సరైన సమయానికి నీరుని కూడా పోస్తూ ఉండండి. 24 గంటల పాటు అలా చూడండి. ఆ పువ్వు 24 గంటల తర్వాత తాజాగా ఉంటే ఆ ఇల్లు ఉత్తమమైనదని, శుభప్రదమైనదని అర్థం. అలా కాకుండా 24 గంటల్లోపే ఆ పువ్వు వాడిపోతే ఏదో ప్రతికూల శక్తి ఆ పువ్వును వికసించనివ్వకుండా అడ్డుకుంటుందని అర్థం చేసుకోండి. ఇది ఆ ఇంట్లో ఉండే మనుషులపై కూడా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ పురోగతిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ ఇంటిని కొనక పోవడం లేదా అద్దెకి దిగక పోవడమే మంచిది.

Also Read: మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా వీటిని కొనకండి

ఇంటి వాస్తు ఇంట్లోని వారిపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో చెప్పక్కర్లేదు. కాబట్టి వాస్తు బాగున్న ఇంటిని తీసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. అందులో నివసించే వారంతా ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు. కాబట్టి వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఉత్తమం.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×