E-Paper
Advertisement

Dulquer Salmaan: నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. హీరో షాకింగ్ స్టేట్‌మెంట్

Dulquer Salmaan: నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. హీరో షాకింగ్ స్టేట్‌మెంట్
Advertisement

Dulquer Salmaan: కొందరు మలయాళ హీరోయిన్లకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. మాలీవుడ్‌కు చెందినవాడే అయినా టాలీవుడ్‌లో అలా ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్న హీరోల లిస్ట్‌లో దుల్కర్ సల్మాన్ ముందుంటాడు. తాను మలయాళ భాషకు చెందిన హీరో అని ఏ మాత్రం ఈగో చూపించకుండా ఇతర భాషల్లో కూడా నటించడానికి ఏ మాత్రం వెనకాడడు దుల్కర్. అందుకే ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో కూడా తను నేరుగా సినిమాలు చేశాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక భాషా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే తను.. కొన్నాళ్ల పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నాడు. దాని వెనుక అసలు కారణం ఏంటో తాజాగా బయటపెట్టాడు.

మొదటిసారి గ్యాప్

Advertisement

దుల్కర్ సల్మాన్ చివరిగా ‘కింగ్ ఆఫ్ కోట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది గతేడాది ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలయ్యింది. ఇక ‘కింగ్ ఆఫ్ కోట’ విడుదలయ్యి సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ తన నుండి మరొక సినిమా రాలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఒక సినిమాకు, మరొక సినిమాకు ఇంత గ్యాప్ తీసుకోవడం దుల్కర్‌కు ఇదే ఫస్ట్ టైమ్. త్వరలోనే ‘లక్కీ భాస్కర్’ అనే మూవీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్నా ఫైనల్‌గా దీపావళికి విడుదల తేదీని ఖారరు చేసుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అసలు తనకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో బయటపెట్టాడు దుల్కర్ సల్మాన్.

Also Read: విడాకుల వెనుక ఆ హీరోయిన్ హస్తం ఉందా..వెలుగులోకి సంచలన నిజం..!

Advertisement

నా తప్పు

‘‘గతేడాది నేను కేవలం కింగ్ ఆఫ్ కోట అనే ఒక్క సినిమాపైనే వర్క్ చేయగలిగాను. అది నా తప్పే. నా సినిమాలు కొన్ని వర్కవుట్ అవ్వలేదు. పైగా నా ఆరోగ్యం కూడా బాలేదు’’ అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. తన ఆరోగ్యం బాలేదు అన్నాడు కానీ అసలు తనకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటి అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు దుల్కర్. తను ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు అయ్యింది. ఈ 13 ఏళ్లలో తను 43 సినిమాల్లో నటించాడు. పైగా సినిమాలతో బిజీగా ఉంటూనే ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే హిందీ వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టాడు.

ప్రతీ భాషలో

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా బయటికి రాగా అందులోనే సగం స్టోరీని బయటపెట్టేశాడు దర్శకుడు. ఈ మూవీ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేరోజు విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్‌కు అన్ని భాషల్లో మార్కెట్ ఉండడంతో తను నటించే ప్రతీ సినిమా ఇతర భాషల్లో కూడా విడుదల అవుతుంటాయి. భారీ బడ్జెట్‌తో ‘లక్కీ భాస్కర్’ను నిర్మించింది సితార ఎంటర్‌టైన్మెంట్స్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×