BigTV English

Dimple Hayathi : ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన డ‌స్కీ బ్యూటీ డింపుల్ హ‌యాతి

Dimple Hayathi : ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన డ‌స్కీ బ్యూటీ డింపుల్ హ‌యాతి

Dimple Hayathi : డ‌స్కీ బ్యూటీ డింపుల్ హయాతి పేరు చెప్ప‌గానే మ‌న‌కు గద్ద‌ల కొండ గ‌ణేష్, ఖిలాఢి, రామబాణం సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ఈ సినిమా త‌ర్వాత ఈ అమ్మ‌డు చేతిలో సినిమాలు లేవుగా అని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ సొగ‌స‌రి పాన్ ఇండియా మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అది కూడా అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా సినిమా. ఇంత‌కీ ఏంటా సినిమా అని అనుకుంటున్నారా? .. ఇండియ‌న్ 2. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇండియ‌న్ 2.


దాదాపు 27 సంవ‌త్స‌రాల ముందు వ‌చ్చిన ఇండియ‌న్ సినిమాకు కొన‌సాగింపుగా ఇండియ‌న్ 2 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఇండియ‌న్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు.. దాన్ని మించేలా ఇండియ‌న్ 2ను రూపొందించే ప్ర‌య‌త్నాల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. కాగా.. ఈ మూవీలో డింపుల్ హ‌యాతి ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుంది. రీసెంట్‌గా మేక‌ర్స్ డింపుల్‌ను సాంగ్‌లో నటించాల‌ని సంప్ర‌దింపులు జ‌రిపారు. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇండియ‌న్ 2లో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌టం అంటే నిజంగానే సొగ‌స‌రికి ల‌క్ క‌లిసి వ‌చ్చిన‌ట్లేన‌ని అనుకోవాలి.

ఇండియ‌న్ 2 విష‌యానికి వ‌స్తే ఇందులో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ వంటి ఇత‌ర స్టార్స్ కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింద‌ని స‌మాచారం. మ‌రో వైపు శంక‌ర్ .. రామ్ చ‌ర‌ణ్‌తో గేమ్ చేంజ‌ర్ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×