Esther Norah : తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఎస్తర్ నోర్హా గురించి తెలియని వాళ్లు ఉండరు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి హీరోయిన్ గా బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె వెయ్యి అబద్దాలు అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎస్తర్ సినిమాలు చేస్తూనే రాపర్, సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కొన్ని రోజులు బాగానే కాపురం చేసిన వీరిద్దరూ మనస్పర్థలు కారణంగా విడిపోయారు.. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటు ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈమె మరోసారి వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ విషయాలను బయటపెట్టింది..
కమిట్మెంట్ ఉంటేనే మాల్స్ ఓపెనింగ్..?
హీరోయిన్ ఎస్తర్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ అవ్వలేక పోయింది. దానిపై అనేక ఇంటర్వ్యూలలో ఈమె బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె కమిట్మెంట్స్ గురించి బయటపెట్టింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడం గురించి ఎస్తర్ మాట్లాడుతూ చెడ్డ దారిలో వెళ్లి త్వరగా ఎదగవచ్చని కానీ అలా పైకి రావడం తనకు ఇష్టం లేదంటూ చెప్పింది. చాలా మంది హీరోయిన్స్ లా తాను కమిట్మెంట్ వంటి విషయాలకు లొంగిపోయుంటే పెద్ద హీరోయిన్ అయ్యుండేదాన్నన్ని చెప్పారు. ఇక్కడ షాపింగ్ మాల్ ను ఓపెన్ చెయ్యాలన్నా కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని బాంబ్ పేల్చింది. నిజానికి అలా హీరోయిన్స్ చేస్తున్నారో లేదో మన కళ్ళతో చూస్తే కానీ చెప్పలేం కానీ అలా ప్రారంభోత్సవం కి కూడా అడగటంతో అలాంటివాటికి దూరంగా ఉన్నట్లు ఆమె అన్నారు.. ఈ వీడియో మరోసారి వైరల్ అవ్వడంతో ఎస్తర్ ఫేమస్ అయ్యింది.
Also Read: ప్చ్.. అదంతా నిజం కదా.. జనాలను బకరాలను చేశారా..?
హీరోయిన్లు వ్యభిచారం చేస్తున్నారు..
ఒకప్పుడు వ్యభిచారం చేసేవారు కనిపిస్తే రాళ్లతో కొట్టేవారు కానీ యేసు ప్రభు అలా చేయొద్దని ప్రజలకు చెప్పారు. అసలు వ్యభిచార గృహలకు వెళ్లేవారు లేకపోతే వాళ్ళు వ్యభిచారం చేయరు కదా అని ఆయన చెప్తారు. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉంటే ఎలాంటి అవసరాలు రావు. ఒక్కసారి డిపెండ్ అయితే జీవితాన్ని కోల్పోవ్వాల్సిందే అని ఆమె అంటున్నారు. వ్యభిచారం చేసే ఒక అమ్మాయి డబ్బు కోసం మాత్రమే ఆ పని చేస్తుంది అలాంటప్పుడు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి ఈ పనిచేయొద్దని మగవాళ్ళు చెప్పొచ్చు కదా అలా ఎందుకు చేయలేరు కేవలం డబ్బు కోసం మాత్రమే ఒక స్త్రీ వ్యభిచారానికి ఒప్పుకుంటుంది. ఏవేవో అనవసరంగా కొంటారు. అది ఆమె ఇస్తే సాయం చేసిన వాళ్లు అవుతారు. అప్పుడు ఆమె తప్పుడు దారి ఎంచుకోదు కదా అని ఎస్తర్ అన్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.