BigTV English

New House: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు పాలు పొంగించాలని ఎందుకు అంటారు?

New House: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు పాలు పొంగించాలని ఎందుకు అంటారు?

హిందూ సనాతన ధర్మంలో గృహప్రవేశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గృహప్రవేశంలో పాలు పొంగించడం అనేది ముఖ్య ఘట్టం. అలా పాలు పొంగిన తర్వాతే దీపాన్ని వెలిగిస్తారు. ఆ పొంగిన పాలు తరువాత మిగిలిన పాలతోనే పాయసాన్ని వండి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది సాంప్రదాయంగా కొన్ని తరాల నుండి వస్తోంది. అలా గృహప్రవేశం నాడు పాలు ఎందుకు పొంగించాలో పండితులు వివరిస్తున్నారు.


కొత్త ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించినప్పుడు అక్కడ మొదట హవన పూజను చేస్తారు. తర్వాత ప్రతి మూలలో గంగా జలాన్ని చల్లుతారు. అలాగే ఇంట్లోని ప్రతి మూలలో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. దుష్టశక్తులు ఏవైనా ఉంటే ఇంటిని వదిలి వెళ్ళిపోతాయని అంటారు. అలాగే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వంటివి కలుగుతాయని చెప్పుకుంటారు.

పాలు పొంగించడం ఎందుకు?
ఇంట్లో హవన పూజ చేసిన తర్వాత మహిళలు పాలు పొంగించేందుకు సిద్దమవుతారు. వంటగదిలో పాలు పొంగించేందుకు ఏర్పాట్లు చేస్తారు. పాలు తెలుపు రంగులో ఉంటాయి. అవి చంద్రుడిని సూచిస్తాయి. చంద్రుడు అంటే ఆనందం, శాంతి, శ్రేయస్సుకు చిహ్నం. కాబట్టి పాలు మరిగించి వంటగదిని ప్రారంభించడం వల్ల ఆ కుటుంబంపై చంద్రుడు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని చెబుతారు.


పాలు మరిగిన తర్వాత అందులో చక్కెర, బియ్యం వేసి పాయసాన్ని తయారు చేస్తారు. అది పాయసాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత ఆ పాయసాన్ని ఇంటిల్లిపాది నోరు తీపి చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల కొత్త ఇంట్లో వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని అనుకున్న పనులు విజయవంతం అవుతాయని వారు ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతారు.

భారతీయ సాంప్రదాయంలో పాలు పొంగించడం అనేది ఒక శుభ సూచకమే. గృహప్రవేశ సమయంలో కొత్త కాపురం మొదలుపెట్టిన వేళ కచ్చితంగా పాలు పొంగిస్తారు. అలాగే రథసప్తమి రోజు కూడా పాలు పొంగిస్తారు. ఇంకా యజ్ఞాలు వంటివి చేసేటప్పుడు కూడా పాలు పొంగించడం అనవాయతీగా వస్తుంది.

ఇంట్లో పాలు పొంగడం అనేది ఒక శుభసంకేతం. కాబట్టి ఎప్పుడైనా పాలు పొంగి కింద ఒలికితే బాధపడకండి… సంతోషించండి. ఎందుకంటే అన్ని శుభకార్యాల్లో కూడా పాలు పొంగించడం అనేది మంచి పనిగానే చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో పాలు సమృద్ధిగా లభిస్తాయని సంపద కూడా అధికంగా లభిస్తుందని చెబుతారు. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం పాలు ఏ వైపున పొంగితే మంచిదో తెలుసుకుందాం.

Also Read: పూజ చేసేటప్పుడు శంఖం ఎందుకు ఊదుతారు ?

మీరు స్టవ్ పై పాలు పెట్టి అవి పొంగుతున్నప్పుడు చూడండి. ఒకవైపు పాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలా తూర్పు దిక్కు వైపు పొంగితే అదృష్టమని అంటారు. సిరి సంపదలు కలుగుతాయని చెబుతారు. ఆ ఇంట్లో ఆరోగ్యం, శాంతి కూడా దక్కుతుందని వివరిస్తారు. తూర్పుదిక్కే ఎంతో మంచిదని చెబుతారు. సూర్యుడు తూర్పు దిక్కు నుంచే వదిలిస్తాడు. అందుకే తూర్పు దిక్కు వైపే శక్తి నిండి ఉంటుందని నమ్ముతారు. తూర్పుదిక్కు వైపు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. తూర్పు వైపు పాలు పొంగితే ఆ ఇంట్లో ఎన్నో శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పాలు పొంగించేటప్పుడు తూర్పు వైపుగా పాలు తొలిసారి కిందకు పడేటట్టు చూసుకోండి. మీ ఇంట్లో సిరిసంపదలు తులతూగడం ఖాయం. అలాగే మీరు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×