BigTV English

Extra Ordinary Man Song : ఓలే ఓలే అమ్మాయి.. ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ డ్యాన్స్‌ ప్రోమో..

Extra Ordinary Man Song :  ఓలే ఓలే అమ్మాయి..  ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ డ్యాన్స్‌ ప్రోమో..
Extra Ordinary Man Song

Extra Ordinary Man Song :ఈ డిసెంబర్ లో ఎక్స్ట్రాడినరీ గా సందడి చేయడానికి తన సరికొత్త మూవీ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ తో థియేటర్లలోకి వస్తున్నాడు హీరో నితిన్. నా పేరు సూర్య మూవీ ఫేమ్ ‘వక్కంతం వంశీ’ దర్శకత్వంలో తరికెక్కిన ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్ మంచి ప్రామిసింగ్ గా ఉండడంతో చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. హీరోతో పాటు డైరెక్టర్ కి కూడా ఈ మూవీ సక్సెస్ ఎంతో ముఖ్యం.


ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా రీసెంట్ గా మూవీకి సంబంధించిన మంచి మాస్ సాంగ్ ప్రోమో ని విడుదల చేశారు.ఓలే ఓలే అమ్మాయి అంటూ సాగే ఈ పాట ప్రోమో కిర్రాక్ మాస్ స్టెప్స్ తో ఇరగదీస్తోంది. మంచి మాస్ బీట్స్ కి శ్రీ లీల మాస్ స్టెప్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రోమో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది.

ఈ ప్రోమోలో శ్రీ లీల ఒకపక్క మోడ్రన్ డ్రెస్సులతో అలరిస్తూనే మరొక పక్క ట్రెడిషనల్ వేర్ తో మతిపోగొడుతుంది. ఈ మాస్ సాంగ్ కు హ్యారిస్ జ‌య‌రాజ్ సంగీతం అందించగా..రామ్‌ మిర్యాల, ప్రియ ఈ పాటలు ఆలపించారు.జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ లో మంచి మాస్ బీట్ తో సాగే ఈ పాటలో నితిన్, శ్రీ లీల ఇద్దరూ మాస్ స్టెప్పులతో.. ఇరగదీసే పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈరోజు ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. ఫుల్ సాంగ్ డిసెంబర్ 4వ తారీఖున విడుదల అవుతుంది.


ఈ మూవీ ట్రైలర్ తో చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని క్లియర్ కట్ గా అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీ కి పోటీగా డిసెంబర్ 7న నాని హాయ్ నాన్న ఒక రోజు ముందే బరిలోకి దిగుతుంది. ఆల్రెడీ థియేటర్లలో సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ ఉండనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×