E-Paper
Advertisement

Aavesham Movie OTT Release: ఓటీటీలోకి రూ.130 కోట్లు కొల్లగొట్టిన పుష్ప విలన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Aavesham Movie OTT Release: ఓటీటీలోకి రూ.130 కోట్లు కొల్లగొట్టిన పుష్ప విలన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
Advertisement

Fahaadh Faasil’s Aavesham Movie OTT Release Date Confirmed: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్‌కి తెలుగులో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్‌తో కలెక్షన్లను నమోదు చేస్తాయి. అయితే ఈ హీరో ఎలాంటి పాత్రలో అయినా నటించి జీవించేస్తాడు. హీరోగా, విలన్‌గా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తెలుగులో కొన్ని సినిమాలు చేసినా తన నటనతో అందరినీ అలరించాడు.

ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాలో బన్వార్ సింగ్ షెకావత్‌గా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఈ మూవీతో అతడి రేంజ్ మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరో మలయాళంలో ఓ మూవీ చేశాడు. ‘ఆవేశం’ పేరుతో ఓ సినిమా చేయగా.. అది బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికి రూ.130 కోట్లకుపై కలెక్షన్లను రాబట్టి అందరినీ అబ్బురపరచింది.

Advertisement

Also Read: వంద కోట్ల క్లబ్ లో పుష్ప విలన్ ‘ఆవేశం’ సినిమా!

ఈ మూవీలో ఫహాద్.. రంగా పాత్రలో నటించి తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు. ఇక థియేటర్లలో దుమ్ము దులిపేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ మే 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఈ అప్డేట్‌‌తో మూవీ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన కొన్ని నిర్మాణ సంస్థలు.. ఈ మూవీని కూడా తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది.

Also Read: Prabhas: ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది.. కొత్త ప్రేమాయణం ఎప్పట్నుంచంటే..?

ఇందుకోసం చాలా మంది సినీ ప్రేక్షకులు ఈ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ని ట్యాగ్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అప్డేట్ రావడంతో అందరూ సంతోష పడుతున్నారు. త్వరలో ఈ మూవీని ఓటీటీలో చూసేయొచ్చు అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×