102 kg of Ganjai Seized at Srikakulam during the Elections 2024: గంజాయి పేరు చెప్పగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ పేరే మొదట వినిపిస్తోంది. ఒడిషా నుంచి ఏపీ మీదుగా వివిధ రాష్ట్రాలకు అక్రమంగా రవాణా అవుతోంది. ఎన్నికలకు ముందు పోలీసులు గంజాయి తోటలను తగలబెట్టేశారు. మళ్లీ షరా మామూలే. ముఖ్యంగా ఎన్నికల వేళ భారీగా గంజాయి పట్టుబడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి పెరిగింది.
ఎన్నికల వేడిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు గంజాయి స్మగ్లర్లు. గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్‌గా గంజాయిని తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసులు చెక్ చేస్తే.. లేకుంటే రాష్ట్రాలు దాటిపోతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో 102 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి కేరళకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలాస రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ప్లాట్‌ఫాం మీద ఉన్నారు కేరళకు చెందిన నలుగురు వ్యక్తులు.
ఎన్నికల వేళ బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో అనుమానాస్పదంగా కనిపించిన వారి బ్యాగులను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. తనిఖీల్లో జీఆర్పీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల లగేజ్ బ్యాగ్‌లను చెక్ చేస్తుండగా కిలోల కిలోలు గంజాయి బయటపడింది. నలుగురు బ్యాగ్‌లు చెక్ చేయగా మొత్తం 102 కేజీల గంజాయి బయటపడింది. తెలిసి మాత్రమే.. తెలీకుండా గంజాయి అక్రమంగా ఏ రేంజ్‌లో తరలిపోతుందో? చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్.
Also Read: ముహూర్తం ఓకే, కడపకు రాహుల్, సీఎం రేవంత్
ఇటీవల ఎన్నికల కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు పట్టుబడిన డబ్బు కంటే డ్రగ్స్ భారీ ఎత్తున పట్టుబడుతున్నట్టు చెప్పారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ మీదుగా గంజాయి ఏ రేంజ్‌లో స్మగ్లింగ్ అవుతుందో తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో 102 కేజీల గంజాయిని పలాస జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
ఒడిస్సా నుండి కేరళ గంజాయి ని తరలించేందుకు పలాస రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ప్లాట్ ఫార్మ్ మీద ఉన్న కేరళకు చెందిన నలుగురు వ్యక్తులను ప్రత్యేక తనికీల్లో ఉన్న జిఆర్పీ పోలీసులు… pic.twitter.com/tNGFJDslAy
— BIG TV Breaking News (@bigtvtelugu) May 3, 2024