E-Paper
Advertisement

Prabhas Movie on LOVE Story: ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది.. కొత్త ప్రేమాయణం ఎప్పట్నుంచంటే?

Prabhas Movie on LOVE Story: ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది.. కొత్త ప్రేమాయణం ఎప్పట్నుంచంటే?
Advertisement

Prabhas Upcoming Movie Update: ‘సలార్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి ముందు వరకు ఎలాంటి హిట్‌లు లేక సతమతమైన ప్రభాస్‌కు, అతడి ఫ్యాన్స్‌కు సలార్ మూవీ ఆకలి తీర్చింది. బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దుమ్ము దులిపేసింది.

ఈ మూవీతో ప్రభాస్ మళ్లీ పట్టాలెక్కాడని.. రాబోయే సినిమాలతో బాక్సాఫీసు బద్దలవడం ఖాయమని అతడి ఫ్యాన్స్ చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించబోయే ఓ సినిమా గురించి అప్డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ‘సీతారామం’ వంటి క్లాసికల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి.

Advertisement

ఈ మూవీ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. యాక్షన్ సినీ ప్రియుల్ని సైతం ఈ మూవీ ఎమోషన్‌తో ఏడిపించేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి – ప్రభాస్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ఓ మూవీ ప్లాన్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు సినీ వర్గాల నుంచి సమచారం వస్తుంది.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీలోని మూడు సాంగ్స్ కంప్లీట్

Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా లవ్ కాన్సెప్ట్‌తో సాగే పీరియాడిక్ యాక్షన్ స్టోరీతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ప్రేమ కథకి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. జులై నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే ప్రభాస్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘కల్కి 2898’ మూవీ ఒకటి. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచేశాయి. ఇందులో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్‌ హీరోలా కనిపించి ఫ్యాన్స్‌కు ట్రీట్ అందించాడు. దీంతో అతడ్ని థియేటర్లలో చూసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Shahid Kapoor: ప్రేమ పేరుతో నన్ను ఇద్దరు మోసం చేశారు: స్టార్ హీరో.. ఆ ఇద్దరు ఎవరంటే..?

దీంతోపాటు మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా జరుగుతున్నట్లు దర్శకుడు ఇటీవలే తెలిపాడు. అలాగే ‘సలార్ 2’ కూడా త్వరలో పట్టాలెక్కబోతుంది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×