Tollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ఒకరు అని చెప్పవచ్చు. నిజానికి వీరిద్దరూ అన్నదమ్ములే అయినా ఎప్పుడూ ఎక్కడ కలసి కనిపించిన దాఖలాలు అయితే లేవని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉంటారు. సాధారణంగా అన్నదమ్ములు అంటే ఏదో ఒక సందర్భంలో అయినా సరే కచ్చితంగా కలిసి కనిపిస్తారు. కానీ ఈ మెగా బ్రదర్స్ మాత్రం ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా అరుదని, అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అని అభిమానులు కూడా కంగారు పడిపోతున్నారు. దీనికి తోడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని ఆరాటపడే అభిమానులు కూడా లేకపోలేదు.
ఈ మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిందా?
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అటు వైష్ణవ తేజ్ , ఇటు సాయి ధరంతేజ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారట. సాయి ధరంతేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అటు వైష్ణవ్ తేజ్ లోని మాస్ యాంగిల్ ని, ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో చూడబోతున్నారు అంటూ మేకర్స్ కూడా చెబుతున్నారు. దీంతో సాయి ధరంతేజ్ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
ఇక మరొకవైపు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ్ సినిమా తర్వాత ఒక హిట్ సబ్జెక్టు కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోగా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. దీంతో కెరియర్లో కాస్త వెనుకబడిపోయాడు.దీనికి తోడు ఆదికేశవ సినిమా స్టోరీ పైన పట్టు ఉండడం, పైగా ఈ చిత్రాన్ని బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించడంతో ఎలాగైనా హిట్టు పడుతుందని అనుకున్నాడు. కానీ అది జరగలేదు.
మల్టీ స్టారర్ కోసం అభిమానులు ఎదురుచూపు..
ఇప్పుడు ఇద్దరూ కూడా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ హీరోలు ఇద్దరి మధ్య దూరం ఉందనే వార్తలు వినిపిస్తున్న సమయంలో.. ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే, అన్ని అనుమానాలకు తెరపడుతుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలి అని, అదే సినిమాలో కుదిరితే వరుణ్ తేజ్ (Varun Tej) క్యామియో రోల్ కూడా పెడితే ఇక అసలైన సూపర్ హిట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల కాంబినేషన్స్ సెట్ అవుతున్న ఈ టైంలో ఒకే ఇంట్లో ఉన్న హీరోలను కలిపి ఒకే సినిమా చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా అని చెబుతున్నారు.
అయితే ఇద్దరు హీరోలు చేయడం పెద్ద సమస్య కాదు కానీ ఆ హీరోల స్థాయికి తగ్గట్టుగా కథ ఉండాలి. లేకపోతే అటువైపు ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమా డిజాస్టర్ గానే నిలుస్తుంది. మొత్తానికైతే వీరిద్దరూ కూడా ఎవరు సినిమాలలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ఇద్దరికీ ఒక మంచి కథ దొరికితే, ఒకే సినిమాలో చేస్తే చూడాలని అభిమానులు కోరుతున్నారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.
also read:Big TV Kissik Talks: ఆ స్థాయి లేదు.. హైపర్ ఆది పరువు తీసిన భాను శ్రీ.. అంతమాట అన్నదేంటి?