Big TV Kissik Talks:బిగ్ టీవీ ఛానల్ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంత పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ జబర్దస్త్ (Jabardast) బ్యూటీ వర్ష (Varsha ) ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 13 ఎపిసోడ్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 14వ ఎపిసోడ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ 14వ ఎపిసోడ్ కి ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ (Bhanu Sri) గెస్ట్ గా విచ్చేసింది. ఇక ఇందులో తన కెరియర్ గురించి, వ్యక్తిగత లైఫ్ గురించి చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో భాగంగానే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Adi) పరువు కూడా తీసేసింది ఈ ముద్దుగుమ్మ.
హైపర్ ఆదిని అవమానించిన భాను శ్రీ..
తాజాగా కిస్సిక్ టాక్స్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా వర్షా ప్రశ్నిస్తూ.. ఇప్పుడు స్వయంవరం పెడితే ఆ లిస్టులో ఎవరు ఉండాలి? అని ప్రశ్నించగా రణబీర్ కపూర్(Ranbeer Kapoor) , విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పేర్లు చెప్పుకొచ్చింది. ఇక బుల్లితెరపై ఆ లిస్టు లేదా అని వర్షా ప్రశ్నించగా.. బుల్లితెరపై నాకు తగిన వ్యక్తి, అంత అందగాడు ఎవరూ లేరు అంటూ హాట్ బాంబు పేల్చింది భాను శ్రీ. హైపర్ ఆది ఉన్నారు కదా అని జబర్దస్త్ కమెడియన్ పేరు వర్షా ప్రస్తావించగా..నన్ను వివాహం చేసుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి. అతడికి ఆ స్థాయి లేదు. అంతేకాదు ఒకసారి కటౌట్ కూడా చూసుకోవాలి. నా హైట్ ఎక్కడ అతడి హైట్ ఎక్కడ.. అసలు పోలికే ఉంటుందా అంటూ కాస్త తగ్గించి మరీ మాట్లాడింది భాను శ్రీ.. దీంతో హైపర్ ఆది అభిమానులు భాను శ్రీ పై మండిపడుతున్నారు. మనిషి కటౌట్ కాదు వ్యక్తిత్వం చూసి జీవిత భాగస్వామిని చేసుకోవాలి అంటూ హితవు పలుకుతున్నారు. మొత్తానికైతే హైపర్ ఆదిని పోపులో కరివేపాకులా తీసేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు
భాను శ్రీ కెరియర్..
ఇక భాను శ్రీ విషయానికి వస్తే యాంకర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఆ తర్వాత జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా సందడి చేసింది. అంతేకాదు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో పాట పాడి పూర్తిస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. ఆల్బమ్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే కొంతమంది హీరోయిన్లకు డూప్ గా నటించి కెరియర్ ను స్పాయిల్ చేసుకుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఇలా కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసి తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు బ్రేకప్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.
also read:Madhubala: డైరెక్టర్ ముద్దు సీన్ చేయమన్నారు.. కన్నప్ప నటి షాకింగ్ కామెంట్స్!