BigTV English

Jagan: జగన్ కొత్త ఆలోచన.. స్టాలిన్ చట్టం పరిశీలన, ఇరుక్కునేది టీడీపీ నేతలేనా?

Jagan: జగన్ కొత్త ఆలోచన.. స్టాలిన్ చట్టం పరిశీలన, ఇరుక్కునేది టీడీపీ నేతలేనా?

Jagan: స్టాలిన్ కొత్త చట్టంపై వైసీపీ గురి పెట్టిందా? టీడీపీ నేతలను ఇరికించేందుకు అదే కరెక్టని భావిస్తోందా? వైసీపీ అధికారంలోకి వస్తే అలాంటి చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తోందా? ఇంతకీ తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ తీసుకొచ్చిన చట్టమేంటి? అనేదానిపై ఇంకాస్త లోతుగా వెళ్దాం.


ఫ్యూచర్ కోసం వైసీపీ కీలక నేతలు కొత్త ప్లాన్ చేస్తున్నారు. 2029లో ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటాలని భావిస్తోంది వైసీపీ. అందుకోసం కూటమి సర్కార్‌పై పదే పదే ఎదురుదాడి మొదలుపెట్టింది. చంద్రబాబు సర్కార్ ఏ పని చేసినా భూతద్దంలో చూడడం మొదలుపెట్టింది.

ఒకవేళ 2029లో ప్రతిపక్షానికి పరిమితమైతే, కచ్చితంగా 2033లో విజయం తమదేనని వైసీపీకి చెందిన కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. వైసీపీ మళ్లీ ఏపీలో అధికారం లోకి వస్తే టీడీపీ నేతల నుంచి మొదలు కేడర్ వరకు అందర్నీ జైలుకి పంపించాలనే ఆలోచన చేస్తున్నట్లు ఓ ఫీలర్ బయటకు వచ్చింది.


ఇందుకోసం రీసెంట్‌గా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో చాలామంది ఫైనాన్స్ వ్యాపారాలు (కాల్ మనీ) వ్యాపారాలు చేస్తున్నారు. అప్పు కట్టలేని పరిస్థితి ఉండేవారి నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు వారిచ్చిన డబ్బుకు సరిపడిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. ఇలాంటివారికే ఊహించని షాక్ ఇచ్చింది స్టాలిన్.

ALSO READ: ఏపీలో మహిళలకు తీపి కబురు.. 18 ఏళ్ల దాటితే చాలు 8 వేలు మీ సొంతం

చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రుణదాతల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.  ఈ నేపథ్యంలో రుణాలు ఇచ్చిన సంస్థలు బలవంతంగా డబ్బు వసూలు చేయకుండా నిరోధించడానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఏప్రిల్ 26న అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు.

అప్పుల తీసుకున్నవారి నుంచి బలవంతంగా రుణాలు వసూళ్లు చేస్తే కఠిన శిక్షలు వేయనుంది. బెదిరించి మరీ అప్పులు వసూలు చేసినట్లు తేలితే ఐదేళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించనుంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన బిల్లును డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రవి ఆమోదం ముద్ర వేశారు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చేసింది. ఈ మధ్యకాలంలో చాలా బ్యాంకులు రికవరీ ఏజెంట్లను పెట్టి రుణాలు వసూలు చేస్తున్నాయి. వారి విషయంలో ఏంటనేది స్పష్టత రావాల్సివుంది.

గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే  కాల్‌మనీ వేధింపుదారులపై ఫోకస్ చేసింది. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే దీనిపై చట్టం తెచ్చినా ఆశ్చర్యపోనక్లర్లేదని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నట్లు భావిస్తోంది. గడిచిన రెండురోజులుగా కొందరు వైసీపీ నేతలు ఈ చట్టంపై ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×