BigTV English

Allu Arjun : ‘స్మగ్లర్‌కి మొక్కలు గిఫ్ట్’… ఫ్యాన్స్‌ కూడా సెటైర్లు వేస్తున్నారా..?

Allu Arjun : ‘స్మగ్లర్‌కి మొక్కలు గిఫ్ట్’… ఫ్యాన్స్‌ కూడా సెటైర్లు వేస్తున్నారా..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తాజాగా నటించిన చిత్రం ‘పుష్ప 2’. ఒకవైపు హిట్ టాక్ తో దూసుకుపోతూ మరొకవైపు కలెక్షన్లు సునామి కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన మూవీగా నిలవబోతోంది. ఇక మరొకసారి అల్లు అర్జున్ తన స్టామినా నిరూపించారు అని చెప్పవచ్చు.


పుష్ప 2 పై పెరుగుతున్న నెగిటివిటీ..

ఇకపోతే ఒకవైపు పుష్ప సినిమా పై పాజిటివ్ పెరుగుతుంటే, మరొకవైపు నెగిటివ్ కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా హీరో సిద్దార్థ్ (Siddharth)లాంటి వాళ్ళు కూడా బీరు, బిర్యానీ ఇస్తే ఎవరైనా సరే ఈవెంట్లకు వస్తారు అంటూ కామెంట్లు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సిద్ధార్థ్ పై మండిపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎర్రచందనం విలువ కోట్లల్లో ఉంటుందని చూపించడంతో.. ప్రజల ప్రభావం అడవులపై పడుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ కాలంలో సినిమాల ప్రభావం అటు పిల్లలపై ఇటు పెద్దలపై ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో స్మగ్లర్ గా హీరో అవతారం ఎత్తడంతో ఇక ప్రజలు కూడా దీనిని బేస్ చేసుకుంటారని కొంతమంది సీనియర్ సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు.


అల్లు అర్జున్ కు మొక్కలు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్యాన్స్..

ఒకప్పుడు కేవలం సినిమాలు సినిమా వరకే ఉండేవి. కానీ ఇప్పుడు సినిమాల ప్రభావం ప్రజల పైన ఎక్కువగా పడుతుంది. కాబట్టి దర్శక నిర్మాతలు కూడా సినిమాలు తెరకెక్కించే ముందు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే వాటిని చేయాలి అని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ అభిమానులు మొక్కలను పంచుతున్నారు. ముఖ్యంగా ఆ చిన్న మొక్కలకు కొబ్బరి పీచుతో తయారు చేసిన బాస్కెట్ తరహా రూపొందించి వాటిలో ఆ మొక్కలు నాటి పంచుతున్నారు. ఆ మొక్కలను అల్లు అర్జున్కి కూడా బహుమతిగా అందించారు..అయితే ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు కూడా స్మగ్లర్ కి మొక్కలు పంపిణీ చేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తూ ఉండడం గమనార్హం.

స్మగ్లర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

ముఖ్యంగా ఫ్యాన్స్ అని వచ్చి, అల్లు అర్జున్ పరువు మొత్తం తీసేస్తూ ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక స్మగ్లర్ కి చెట్లను నరకడం మాత్రమే తెలుసు. అలాంటి స్మగ్లర్ చెట్లను పెంచుతాడా? అంటూ కొంతమంది సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మొక్కలను అల్లు అర్జున్ కి గిఫ్టుగా ఇవ్వడంతో సర్వత్ర నెగెటివిటీని పెంచుతోందని చెప్పాలి. ఇకపోతే అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×