BigTV English

Mahesh Babu : రాజమౌళి – మహేష్ మధ్య గొడవలా.. సినిమాకు బ్రేక్ పడుతుందా..?

Mahesh Babu : రాజమౌళి – మహేష్ మధ్య గొడవలా.. సినిమాకు బ్రేక్ పడుతుందా..?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలుసు.. భారీ బడ్జెట్ తో తెరకేకుతున్న ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామా.. అసలు మహేష్ బాబు లుక్ ఇందులో ఎలా ఉందో అని ఆతృత కనబరుస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ పూర్తి చేసుకొని విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీ కోసం మహేష్ బాబు, రాజమౌళి మధ్య గొడవలు జరిగాయని ఓ వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు. కానీ ఈ న్యూస్ మాత్రం కోడై కూస్తోంది… అసలు మేటర్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


రాజమౌళి తో సినిమా కోసం హీరోల పోటీ.. 

రాజమౌళితో సినిమా అంటే స్టార్ హీరోలు సైతం అలర్ట్ గా ఉంటారు. సినిమాకు ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటాడనే కానీ దాని తగినట్టుగా ఫలితం కూడా ఉంటుందని అందరికి తెలుసు. అందుకే లైఫ్ లో ఒక్కసారైన కూడా ఆయనతో మూవీ చెయ్యాలని ఆసక్తి చూపిస్తుంటారు. రాజమౌళితో సినిమా ఓకే చేయడం ఒక ఎత్తైతే అతను కోరుకునేలా పనిచేయడం కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. అందుకే రాజమౌళిని అందరు పని రాక్షసుడు అంటారు. తను సినిమాకు అంత కష్టపడతాడు. కష్టం అంటే ఏంటో తెలియకుండా సినిమా హిట్ అవుతుంది.. అయితే మహేష్ బాబుతో మూవీ మొదలైనప్పటి నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు జక్కన్న రూల్స్ ను బ్రేక్ చేసాడంటూ ఓ వార్త వినిపిస్తుంది. అందుకు కారణం ఒక యాడ్ అని తెలుస్తుంది.. అదేంటో వివరంగా తెలుసుకుందాం..


మహేష్ బాబు కొత్త యాడ్…

ఒకసారి మహేష్ బాబు ఒక వైపు సినిమాల తో పాటు మరోవైపు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తూ బిజీగా ఉంటున్నాడు. మహేష్ సినిమాల తో పాటు వాణిజ్య ప్రకటనలను చేస్తుంటాడు. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు.. తాజాగా ఓ యాడ్ లో కనిపించాడు. లేటెస్ట్ గా ట్రెండ్స్ యాడ్ లో కనిపించాడు. సినిమా మొదలు పెట్టాక ఎలాంటి యాడ్స్ చేయకూడదని రాజమౌళి కండీషన్ ని సైతం మహేష్ బ్రేక్ చేశాడని అందరు అంటున్నారు. మహేష్ లుక్స్ చూస్తే ఇది ఈమధ్య చేసిన దానిలాగే ఉంది.. మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనిపై రాజమౌళి ప్రమేయం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాజమౌళి మహేష్ కాంబో సినిమా పై హ్యూజ్ బజ్ ఉంది. ఈ సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విజువల్ ట్రీట్ అనిపించేలా చాలా సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.. మరి వచ్చే ఏడాది ఈ మూవీతో థియేటర్లు బద్దలు అవుతాయని ఫ్యాన్స్ అంటున్నారు.. చూడాలి ఎలా ఉంటుందో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×