Indian Railways: చాలా మంది రైల్వే ప్రయాణీకులు రకరకాల కారణాలతో తమ టికెట్లను క్యాన్సిల్ చేసుంకుంటారు. అనివార్య కారణాలతో ప్రయాణాల రద్దు వలన టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందే ప్రయత్నం చేస్తారు. అయితే, టికెట్ క్యాన్సిలేషన్ ఎంత ముందుగా చేసుకుంటే, చెల్లించిన మొత్తంలో అంత ఎక్కువగా రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే RAC (రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్) టికెట్ ఉండి, దానిని రద్దు కూడా పూర్తి మొత్తంలో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఆ టికెట్‌ను ఎప్పుడు? ఎలా? రద్దు చేసుకుంటారనే దానిపై రీఫండ్ ఆధారపడి ఉంటుంది.
⦿ మీరు టికెట్ ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే..
ఒకవేళ మీరు RAC టికెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే, చార్ట్ సిద్ధం కావడానికి ముందే క్యాన్సిల్ చేసుకుంటే, ప్రతి ప్రయాణీకుడికి రూ. 60 తగ్గింపు తర్వాత రీఫండ్ లభిస్తుంది. చార్ట్ సిద్ధం అయిన తర్వాత టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు. అప్పుడు మీరు IRCTCలో TDR (టిక్కెట్ డిపాజిట్ రిసీట్)ను సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. రైల్వే అధికారులు దానిని యాక్సెప్ట్ చేస్తే రీఫండ్ ప్రాసెస్ చేయబడుతుంది.
⦿ మీరు రైల్వే కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకుంటే..
ఒకవేళ మీరు రైల్వే కౌంటర్ లో RAC టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ క్యాన్సిలేషన్ కూడా అక్కడి నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు మీరు టికెట్ రద్దు చేసుకుంటే.. ప్రతి ప్రయాణీకుడికి రూ. 60 తగ్గింపు తర్వాత మీకు రీఫండ్ లభిస్తుంది. ఆ తర్వాత మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు.
⦿ రీఫండ్ కోసం TDR ఎలా దాఖలు చేయాలి?
ఒకవేళ మీరు ఛార్ట్ రెడీ అయిన తర్వాత మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, IRCTC వెబ్ సైట్ లో TDR రిక్వెస్ట్ చేసుకోవచ్చు. రైల్వే అధికారులు మీ రిక్వెస్ట్ ను రివ్యూ చేసి, రీఫండ్ ను ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే, నిర్ణీత సమయానికి ముదే టికెట్ రద్దు చేసుకుంటే, రీఫండ్ లభిస్తుంది. కొద్ది మొత్తంలో ఛార్జీలు కేటాయించుకుని మిగతా మొత్తాన్ని అందిస్తారు. తుది చార్ట్ తయారు చేసిన తర్వాత మీరు రద్దు చేసుకోవాలనుకుంటే, TDRను ఫైల్ చేయాలి. దాని మీద రీఫండ్ వస్తుందనే గ్యారెంటీ లేదు.
RAC టికెట్ అంటే ఏంటి?
రైళ్లలో రిజర్వేషన్ కోచ్ లలో స్లీపర్ క్లాస్ నుంచి సెకెండ్ ఏసీ వరకు RAC సీట్లు ఉంటాయి. కోచ్ లోని 6 మెయిన్ సీట్లు కాకుండా ఇవతలి వైపు 2 సీట్లు ఉంటాయి. వీటిని ఫుల్ లేదా హాఫ్ గా మార్చే అవకాశం ఉంటుంది. అంటే, ఈ సీటు మీద ఇద్దరు కూర్చోవచ్చు. లేదంటే, ఒకే ప్రయాణీకుడికి సీటు లభిస్తుంది. రైళ్లలో ప్రయాణ సమయంలో ఈ సీట్లను RACగా కేటాయిస్తారు. ఇతరుల టికెట్ క్యాన్సిలే చేయబడినప్పుడు మాత్రమే RAC టికెట్ కన్ఫార్మ్ అవుతుంది. ప్రయాణీకుడికి అదే సీటు మొత్తం కేటాయించబడుతుంది. లేదంటే పూర్తి సీటు మరో ప్లేస్ లో కేటాయిస్తారు. ఇది ఒక రకమైన వెయిటింగ్ టికెట్ గా చెప్పుకోవచ్చు. దానితో పోల్చితే ఇది కాస్త బెస్ట్.