BigTV English

Rajinikanth – Balakrishna – Chiranjeevi: ఒకే వేదికపై సినీ స్టార్ల సందడి.. ట్రెండింగ్‌లో విజువల్స్.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్!

Rajinikanth – Balakrishna – Chiranjeevi: ఒకే వేదికపై సినీ స్టార్ల సందడి.. ట్రెండింగ్‌లో విజువల్స్.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్!

Rajinikanth – Balakrishna – Chiranjeevi on Same Stage: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికీ ఊహించని విధంగా వచ్చాయి. వైసీపీ అండ్ ఎన్డీఏ కూటమి (టీడీపీ + జనసేన+ బీజేపీ) మధ్య గట్టి పోటీ ఉంటుందని యావత్ ఆంధ్రరాష్ట్ర ప్రజలు భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వై నాట్ 175 అన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఎన్డీఏ కూటమి ఎవరి అంచనాలకు అందకుండా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.


అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కేసరపల్లిలో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబు నాయుడితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ‘కొణిదెల పవన్ కల్యాన్ అనే నేను’ అని అనగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. రాజకీయ నాయకులతో సహా సినీ ఫ్యాన్స్‌ రచ్చరచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ సభా ప్రాంగణం మొత్తం గోళ గోళ చేశారు. అనంతరం మరికొంత మంది నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు.


Also Read: ఈ శుక్రవారం థియేటర్లోకి క్రేజీ సినిమాలు.. ఇక సందడే సందడి

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ముందు.. ఏర్పాటు చేసిన స్టేజ్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, నందమూరి ఫ్యామిలీ, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా మరికొంత మంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే ఇక్కడ ఒకే స్టేజ్‌పై సీనియర్ స్టార్ హీరోలను చూసి తమ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదికపై నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలను ఒకే వేదికపై చూడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Nara Lokesh : పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్.. నెట్టింట వీడియో వైరల్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×