BigTV English

Bird Flu H9N2: భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు.. నాలుగేళ్ల చిన్నారికి పాజిటివ్..!

Bird Flu H9N2: భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు.. నాలుగేళ్ల చిన్నారికి పాజిటివ్..!

4 Years Old Child Tested Positive for Bird Flu H9N2 in India: భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ నాలుగేళ్ల చిన్నారి హెచ్9ఎన్2 రకం వైరస్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్య, అధిక జ్వరం, పొత్తికడుపు తిమ్మిర వంటి సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరిలో చేర్చారు. ఆ తర్వాత ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స తర్వాత మూడు నెలల తర్వాత ఇటీవల ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు.


రెండో కేసు.. కలకలం

సాధారణంగా పక్షులకు సంక్రమించే ఈ బర్డ్ ఫ్లూ.. ప్రస్తుతం మనుషుల్లో కూడా కనిపిస్తోంది. ఎక్కువగా చైనా, మెక్సికో వంటి దేశాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. బర్డ్ ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ వైరస్‌తో ప్రపంచంలో తొలి మరణం అదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే మృతుడు పౌల్ట్రీ, జంతువుల వద్దకు వెళ్లిన ఆధారాలు లేవని తెలిపింది. మొదటి నుంచి అతడికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే మరణించినట్లు తెలిపింది. ఇక భారత్‌లో 2019లో తొలి కేసు నమోదైంది. తాజాగా, రెండో కేసు నమోదు కావడంతో దేశంలో కలకలం రేగుతోంది.


Also Read: టెస్లా మాటేంటి? తాను స్వార్థపరుడ్నికాదన్న మంత్రి కుమారస్వామి

లక్షణాలు తక్కువ.. వ్యాప్తి ఎక్కువ

చిన్నారి ఇంటి పరిసర ప్రాంతాల్లో కోళ్లు ఎక్కువగా ఉండడంతో సోకిందని భావిస్తున్నారు. అయితే ఆ చిన్నారి కుటుంబం, బంధువుల్లో వ్యాధికి సంబంధించిన లక్షణాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో హెచ్9ఎన్2 బర్డ్ ఫ్లూను మనుషుల్లో గుర్తించడం రెండోసారి. అయితే ఆ చిన్నారికి టీకాలు వేశారా? లేదా? ఆస్పత్రిలో ఎలాంటి చికిత్స అందించారనే వివరాలు తెలియరాలేదు. కాగా, హెచ్9ఎన్2 వైరస్‌తో వ్యాధి లక్షణాల తీవ్ర తక్కువగానే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనగా.. అధికంగా వ్యాప్తిలో ఉన్న వేరియంట్లలో మాత్రం ఈ వైరస్ ఒకటని వెల్లడించింది. అయితే ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×