E-Paper
Advertisement

Movies Releasing This Week: ఈ శుక్రవారం థియేటర్లోకి క్రేజీ సినిమాలు.. ఇక సందడే సందడి!

Movies Releasing This Week: ఈ శుక్రవారం థియేటర్లోకి క్రేజీ సినిమాలు.. ఇక సందడే సందడి!
Advertisement

This Week Releasing Movies: ప్రతివారం థియేటర్లలో సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని పాజిటివ్ టాక్‌ను అందుకుని , బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తుంటాయి. మరికొన్ని మాత్రం ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ అందుకొని బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడతాయి. ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి బడా హీరోల సినిమాల సందడి లేక థియేటర్ల కళ తప్పింది. ఒక బడా హీరో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి టాలీవుడ్ చాలా రోజులే అవుతుంది.

సమ్మర్‌లో డీజే టిల్లు వంటి సినిమా మంచి హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి హిట్ అందించే సినిమా మళ్ళీ రాలేదు. అదీగాక సమ్మర్ మొత్తం ఐపీఎల్, ఎలక్షన్స్ హడావుడి ఉండేది. దీంతో పెద్దగా బడా హీరోల సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అన్నీ చిన్న చిన్న సినిమాలే. ఇక వాటి హడావుడి అయిపోయిన వెంటనే మే 31 నుంచి థియేటర్లు మళ్లీ కళకళలాడాయి. మే 31న ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మంచి టాక్ ను అందుకున్నాయి. అయితే ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

Advertisement

మహారాజా..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన సినిమాలొస్తున్నాయంటే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. మరి ఈ హీరో నటించిన కొత్త సినిమా ‘మహారాజా’. ఈ మూవీ జూన్ 14న అంటే ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం చేసినట్లు కనిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read: తండ్రి ప్రమాణ స్వీకారానికి అకీరా, ఆద్య.. పవన్‌కు రేణు విషెస్..

యేవమ్ అండ్ మ్యూజిక్ షాప్ మూర్తి..

కలర్ ఫొటో సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది నటి చాందిని చౌదరి. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో వరుస సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు చేస్తుంది.

అందులో చాందిని ప్రధాన పాత్రలో చేస్తున్న మూవీ ‘యేవమ్’ ఒకటి కాగా.. ఇంకోటి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ రెండు సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియోసిటీని క్రియేట్ చేశాయి. ఇక ఈ రెండు మూవీలో జూన్ 14న అంటే శుక్రవారమే రిలీజ్ అవుతుండటం విశేషం. మరి ఈ రెండు మూవీలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి.

Also Read: Kalki 2898 AD: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన ‘కల్కి 2898 ఏడీ’

హరోం హర..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబుకు హిట్ పడి చాలా కాలమే అయింది. ఇందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సారి ‘హరోం హర’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ జూన్ 14న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ అయినా సుధీర్ బాబుకి మంచి హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ నాలుగు సినిమాలు జూన్ 14న రిలీజ్ కానుండటంతో ఏ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటుందో వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×