BigTV English

Fire Accident in Kalyan Ram Sets: నందమూరి కళ్యాన్ రామ్ సినిమా NKR 21 సెట్ లో అగ్ని ప్రమాదం.. కోట్ల నష్టం!

Fire Accident in Kalyan Ram Sets: నందమూరి కళ్యాన్ రామ్ సినిమా NKR 21 సెట్ లో అగ్ని ప్రమాదం.. కోట్ల నష్టం!

Fire Accident in Nandamuri Kalyan Ram Movie Set’s: నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. గతేడాది డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది జరిగి చాలా రోజులు అయ్యాక బయటపడడం విశేషం. కొన్ని సీన్స్ కోసం CBI ఆఫీస్ సెట్ వేశారట. రూ. 4 కోట్లు ఖర్చుపెట్టి ఆ ఆఫీస్ సెట్ వేయగా.. 9 రోజులుగా అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే చివరి రోజున ఈ సెట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యిందని సమాచారం. దీనివలన దాదాపు కళ్యాణ్ రామ్ కు కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందని టాక్. అయితే ఈ విషయం ఎక్కడ పొక్కకుండా మేకర్స్ బాగా మ్యానేజ్ చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Karthika Deepam 2 Child Artist Shourya: ముద్దు ముద్దుగా మాట్లాడే ఈ చిన్నారి తల్లిదండ్రుల గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు


ప్రస్తుతం ఈ సినిమా వేరే లొకేషన్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక హీరోగానే కాకుండా కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం దేవర సినిమా కళ్యాణ్ రామ్ చేతిలోనే ఉంది. మరి ఈ రెండు సినిమాలతో నందమూరి హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×