E-Paper
Advertisement

Man Kills Minor Girl: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్.. తల నరికి తీసుకెళ్లిన వ్యక్తి!

Man Kills Minor Girl: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్.. తల నరికి తీసుకెళ్లిన వ్యక్తి!
Advertisement

Man Kills Minor Girl after Engagement Called Off: వయసులో అతను ఆమె కంటే 16 సంవత్సరాలు పెద్దవాడు. అయినా ఇంట్లోవారు అతనితో పెళ్లి నిశ్చయించారు. త్వరలోనే ఎంగేజ్ మెంట్ కు ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో బాలిక మైనర్ అని తెలుసుకున్న మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు నిశ్చితార్థంను ఆపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన వరుడు.. మైనర్ బాలిక తల నరికి.. ఆ తల తీసుకుని పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటలోని ముట్లు గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 సంవత్సరాల బాలికకు ప్రకాష్ (32) అనే వ్యక్తితో గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివాహాన్ని రద్దు చేసేందుకు ఒప్పించారు. విషయం తెలుసుకున్న ప్రకాష్.. బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెను బయటకు లాక్కొచ్చి తలను నరికివేశాడు. అడ్డొచ్చిన బాలిక తల్లిని గాయపరిచాడు. ఆపై నరికిన తలను తీసుకుని పారిపోయాడు.

Advertisement

Also Read: Minor Assault : మైనర్ పై గ్యాంగ్ రేప్.. పేట్రేగిపోయిన నీచులు

స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. తలలేని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గాయపడిన బాలిక తల్లిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బాలిక ఇటీవల రాష్ట్ర బోర్డు పరీక్షల్లో 52 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైనట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×