BigTV English

Karthika Deepam 2 Child Artist Shourya: ముద్దు ముద్దుగా మాట్లాడే ఈ చిన్నారి తల్లిదండ్రుల గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Karthika Deepam 2 Child Artist Shourya: ముద్దు ముద్దుగా మాట్లాడే ఈ చిన్నారి తల్లిదండ్రుల గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Karthika Deepam 2 Child Artist Shourya: కార్తీక దీపం.. ఇది నవ వసంతం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ తో వంటలక్క ఎంతపేరు తెచ్చుకుందో అందరికి తెల్సిందే. ఇక ఇప్పుడు దీపతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ శౌర్య కు కూడా మంచి పేరు వచ్చింది. ముద్దు ముద్దు మాటలతో కార్తీక్.. కార్తీక్ అంటూ చలాకీగా తిరుగుతూ ఉంటుంది. ఈ చిన్నదాని పేరు చైత్ర లక్ష్మీ. కుంకుమపువ్వు, రాధకి నీవేరా ప్రాణం వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించిన చైత్రకు కార్తీక దీపం మంచి గుర్తింపును తెచ్చింది.


ఇక సీరియల్ లో ఎంతో చలాకీగా ఉండే చైత్ర రియల్ లైఫ్ లో ఎంతో బాధను మోస్తుంది. ఇంత చిన్న వయస్సులోనే తల్లిదండ్రుల కోసం కష్టపడుతుంది. సాధారణంగా ఒక ఇంట్లో చెవిటి, మూగ పిల్లలు వింటే వారిని హ్యాండిల్ చేయడం కష్టం. కానీ, చైత్ర తల్లిదండ్రులు ఇద్దరూ చెవిటి, మూగవారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పుట్టుకతోనే చెవిటి మూగ వాళ్లైన ఈ జంటకు చైత్ర లక్ష్మీ జన్మించింది. తల్లిదండ్రులు ఎలా ఉన్నా చైత్ర మాత్రం చిన్నతనం నుంచి యమా యాక్టివ్ గా పెరిగింది.

ఐదేళ్లు నిండకుండానే బాలనటిగా సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చైత్ర మాట్లాడుతూ.. ” మీ అమ్మ నాన్న చెవిటి మూగ కదా.. వాళ్లని అలా పుట్టించినందుకు దేవుడుపై కోపం లేదా? అంటే ఏం లేదు.. వాళ్ల మాటల్ని కూడా నేనే మాట్లాడేస్తున్నా కదా” అని నవ్వేసింది. ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ లో మదర్స్ డే స్పెషల్ ఈవెంట్ చేశారు. ఇందులో చైత్ర తన తల్లి కోసం ఒక పాట పాడింది. ఎవరు రాయగలరు అమ్మా అను మాటకన్నా కమ్మని కావ్యం సాంగ్ పాడి అదరగొట్టింది.


ఇక ఈ స్టేజి మీద వాళ్ల అమ్మను పరిచయం చేసింది. సైగలతో తన తల్లితో మాట్లాడి మెప్పించింది. ఇక చైత్ర రియల్ స్టోరీ విని అందరూ కంటతడి పెట్టుకున్నారు. తన తల్లిదండ్రుల కోసమే తాను నటిస్తున్నానని, అమ్మకి నాన్నకి మాటలు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను అంటూ చైత్ర చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×