BigTV English

Ram Gopal Varma: సినీ చరిత్రలోనే మొదటిసారి .. ఏంటి వర్మ ఈ ట్విస్ట్ ..

Ram Gopal Varma: సినీ చరిత్రలోనే మొదటిసారి .. ఏంటి వర్మ ఈ ట్విస్ట్ ..

Ram Gopal Varma: తెలుగు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈయన చేస్తున్న సినిమాల కన్నా వివాదాలే ఎక్కువగా వినిపిస్తాయి . అందుకే ఆయన పేరు వివాదాస్పద దర్శకుడు అని మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. అందుకే ఆయనకు సెన్సేషనల్ డైరెక్టర్ అనే పేరు పెట్టేశారు. సినిమాల్లో వైవిద్యం చూపించడం, మాటలతో మజా చేయడం, అమ్మాయిల అందాలపై బోల్డ్ కామెంట్స్ చేయడం, తనకు నచ్చినట్టుగా ఉండటం వర్మ నైజం. ఈ క్రమంలోనే పలు డిఫరెంట్ బోల్డ్ సినిమాలు తెరకెక్కించిన ఆయన గతంలో డేంజరస్ అనే సినిమాను తెరకెక్కించాడు. అది అడ్రెస్స్ లేకుండా పోయింది . ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . ఆ మూవీ పేరే శారీ .. ఈ సినిమా బోల్డ్ మూవీగా రాబోతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ సాంగ్ గురించి ఓ అప్డేట్ ను వదిలారు. దాని గురించి వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


వర్మ ఏది చేసిన ప్రత్యేకమే ఉండాలి .. అలాగే శారీ మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శారీ అనే టైటిల్ తో వస్తున్న సినిమాకు శారీ లేకుండా ప్రమోట్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో వదిలి కుర్రకారులో సెగలు పుట్టించారు. అంతేకాదు ఈ పాటకు Al వినియోగించి మ్యూజిక్ ను క్రియేట్ చేసినట్లు అలాగే సాంగ్ మూడు వర్షన్ లలో రాబోతున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ సినిమాలోని BGM, సంగీతం. సాంగ్స్ అన్ని AIతో రూపొందించినవే. AI మ్యూజిక్ వాడిన తొలి చలనచిత్రం ఇదేనని వర్మ వెల్లడించారు..

అదే విధంగా శారీ మూవీలోని ఐ వాంట్ లవ్ సాంగ్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీ ఇమేజిన్ చేయబడిన 3 వెర్షన్లలో రాబోతుందని తాజాగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నాడు. సినీ చరిత్రలోనే మొదటిసారి .. ఇలాంటి కొత్త ప్రయోగం చెయ్యడం అని తెలుస్తుంది. ‘శారీ’ అనే టైటిల్, ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే లాగ్ లైన్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో విడుదల చేయనున్నారు వర్మ. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో RGV ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రముఖ డిస్టిబ్యూటర్ ముత్యాల రాందాస్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో రాబోతుందని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ను చూస్తేనే తెలుస్తుంది.. వర్మ తెరకెక్కించే సినిమాలు వివాదాలు విమర్శలు అందుకుంటాయి. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎన్ని వివాదాలను అందుకుంటుందో చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×