E-Paper
Advertisement

Lucas Bravo: రామ్ చ‌ర‌ణ్‌పై హాలీవుడ్ న‌టుడు లుకాస్ బ్రావో ప్ర‌శంస‌ల వ‌ర్షం

Lucas Bravo: రామ్ చ‌ర‌ణ్‌పై హాలీవుడ్ న‌టుడు లుకాస్ బ్రావో ప్ర‌శంస‌ల వ‌ర్షం
Advertisement
Ramcharan – RRR: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ పాత్రకు జీవం పోశాడు. అతడి పాత్ర ఆద్యంతం భారీ యాక్షన్, ఎమోషన్స్ సినీ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది. అతడి హావభావాలు ఒక్కొక్క సినీ అభిమానిని కట్టిపడేసింది. బ్రిటీషర్ల తరపున భారతీయ ఉద్యమకారులపైనే దాడికి దిగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్ యాక్టింగ్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

చ‌ర‌ణ్ యాక్టింగ్‌కు భారతీయ సినీ ప్రేక్ష‌కులే కాదు.. హాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన తర్వాత బ్రిటీష్ రాణులు సైతం చరణ్‌ను మెచ్చుకున్నారు. కాగా ప్రేక్షకాభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డును సైతం అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ సొంతం చేసుకుని తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే ఈ సినిమాకి గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాలు లభించడంతో ప్రపంచం నలుమూలల యాక్టర్ల దృష్టి పడింది.

Also Read: ‘రాయన్’ థియేటర్లలో మిస్ అయ్యారా.. డోంట్ వర్రీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది..

Advertisement

దీంతో ఆర్ఆర్ఆర్ నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై హాలీవుడ్ నటీ నటులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా చరణ్‌ నటనకు ప్రముఖ హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం ఫిదా అయ్యాడు. ఈ మేరకు చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు. అలాగే మరికొంత మంది హాలీవుడ్ స్టార్ యాక్టర్లు సైతం చరణ్ యాక్టింగ్‌ను ప్రశంసించారు. అలాగే ఎన్టీఆర్ నటనను సైతం మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు చరణ్ యాక్టింగ్ పై మరో ఫ్రెంచ్ స్టార్ నటుడు ప్రశంసలు కురిపించాడు.

ప్రముఖ ఫ్రెంచ్ యాక్టర్ లుకాస్ బ్రావో తనదైన శైలిలో ఆర్ఆర్ఆర్ లోని చరణ్ నటనను మెచ్చుకున్నారు. చరణ్ అత్యద్భుతంగా నటించాడని అన్నారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌లో లుకాస్ బ్రావో పాల్గొనగా.. అతడికి ఒక ప్రశ్న ఎదురైంది. ఇండియ‌న్ సినిమాల్లో మీకు నచ్చిన న‌టుడు గురించి చెప్ప‌మ‌ని అడిగిన‌ప్పుడు అతడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చూశాన‌ని.. అందులో ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడు అని అన్నారు. చరణ్ చేసే యాక్షన్ ఫైట్స్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దీంతో అతడి కామెంట్స్ మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×