Baby Jhon.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘నేను శైలజ’ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది కీర్తి సురేష్(Keerthi Suresh). ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె .. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin)దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించి భారీ పాపులారిటీ అందుకున్న కీర్తి సురేష్, మరొకవైపు చిరంజీవి(Chiranjeevi), రజనీకాంత్(Rajinikanth) వంటి హీరోలకు చెల్లెలిగా కూడా నటించింది.
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు..
ఇక ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈమె, తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ తట్టిల్ (Antony tattil) ను సింపుల్ గా గోవాలో వివాహం చేసుకుంది. ఆంటోనీ దుబాయ్ లో బిగ్గెస్ట్ బిజినెస్ మాన్ గా పేరు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా వివాహం తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అందులో భాగంగానే ఈమె నటించిన తొలి చిత్రం బేబీ జాన్(Baby John). ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ అందుకున్న వరుణ్ ధావన్ (Varun Dhawan) ఈ సినిమాలో హీరోగా నటించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేకపోయింది. మొదటి రోజు మంచి కలెక్షన్లు సాధించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో థియేటర్ యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షోలు తగ్గించిన థియేటర్ యాజమాన్యం..
నిజానికి ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయినా ‘తేరి’ సినిమాకి రీమేక్. ఇకపోతే ఈ సినిమా మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బయ్యర్లను బెంబేలెత్తిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ కి జోడీగా నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించినా సరే ఫలితం కనిపించడం లేదు. ఈ సినిమాకి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ కథ అందించగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు. విడుదలైన మొదటి రోజు రూ.11.75 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. కానీ రెండవ రోజు మాత్రం డీలా పడిపోయింది. దీనికి తోడు మరొకవైపు పుష్ప 2 సినిమా ఎఫెక్ట్ బేబీ జాన్ పై పడింది. అలాగే ఇటీవల విడుదలైన మార్కో సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ రెండు చిత్రాల కారణంగా బేబీ జాన్ సినిమాకు ఆదరణ తగ్గిపోయింది..అందుకే ముంబైలోని ఒక మూవీ మ్యాక్స్ థియేటర్లో ఆదివారం నుండి మార్కో సినిమాను ఐదు షోలు ప్రదర్శించడానికి ప్లాన్ చేశారు థియేటర్ యాజమాన్యం. అందులో భాగంగానే బేబీ జాన్ ను కేవలం మూడు షోలకు తగ్గించారు. ఐకానిక్ G7 మల్టీప్లెక్స్ లో ఉన్న బేబీ జాన్ చిత్రంను 200 సీట్లు ఉన్న గేలక్సీ కి మార్చబడింది. ఇంతకుముందు 1000 సీట్లతో ఉన్న గైటీలో ప్రదర్శించబడింది. రాబోయే రోజుల్లో సోలు మరిన్ని తగ్గించబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా ముంబైలో మాత్రం ఈ సినిమాకి భారీగా నష్టం కలుగుతోంది అని చెప్పవచ్చు.