Game Changer: ఆర్ఆర్ఆర్(RRR ) సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు రామ్ చరణ్ (Ram Charan) . కొడితే కుంభస్థలమే ఢీకొట్టాలి అనే రేంజ్ లో పాన్ ఇండియా సినిమా చేసి ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్నారు. అందుకే ఆయన తదుపరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ (S. Shankar) దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer) . భారీ అంచనాల మధ్య వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘పుష్ప 2’ డైరక్టర్ సుకుమార్ (Sukumar) విచ్చేసి సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చి అందరి అంచనాలను మరింత పెంచేశారు.
256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్..
ఇదిలా ఉండగా రామ్ చరణ్ కి ఆయన అభిమానులు ఊహించని గౌరవాన్ని అందించారు. అంతేకాదు ఇప్పటివరకు ఎవరు ఈ రేంజ్ లో ఇంత పెద్ద బహుమతిని స్వీకరించలేదు కూడా.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద కటౌట్ కలిగి ఉన్న హీరోగా ఇప్పుడు రామ్ చరణ్ అవతరించనున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. గేమ్ ఛేంజర్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లోని ఒక లుక్ ను ఈ కటౌట్ రూపంలో రూపొందించారు. ఏది ఏమైనా రామ్ చరణ్ అభిమానులు ఆయన కోసం తయారు చేసిన ఈ కటౌట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
గేమ్ ఛేంజర్ మూవీ విశేషాలు..
శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే తెలుగమ్మాయి అంజలి(Anjali) తో పాటూ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ కూడా మరో కొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జనవరి 4 లేదా 5వ తేదీలలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు విడుదల కాకముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">