JC Prabhakar on Perni Nani: ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు ఆయా నేతలను వెంటాడుతున్నాయి. రోజుకో నేతపై కేసులు నమోదు అవుతున్నాయి. లేటెస్ట్‌గా మాజీ మంత్రి పేర్నినానిపై మండిపడ్డారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.
మీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావని కాసింత ఘాటుగా చెప్పారు జేసీ. పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం ఉందా? అంటూ ప్రశ్నించారు. మా మీద కేసులు పెట్టినప్పుడు.. మా ఇంట్లో ఆడవాళ్లు మీకు గుర్తుకు రాలేదా? మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచివాళ్లు కాబట్టే సైలెంట్‌గా ఉన్నారన్నారు.
వైసీపీ వాళ్ళు మా మంచి తనాన్ని చేతగాని తనంగా భావించవద్దన్నారు. నువ్వు తప్పు చేశావు కాబట్టే.. మీ మొహంలో రక్తం చుక్క లేదని తేల్చేశారు. ఆదివారం ఉదయం తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన మంచి తనం మా చేతులు కట్టేసిందని, మీడియా ముందు అలా మాట్లాడటానికి సిగ్గులేదని విరుచుకుపడ్డారు.
నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సభ్యత గుర్తుకు రాలేదా? పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడారని రుసరుసలాడారు. అన్నీ మరిచిపోయి సిగ్గు లేకుండా ఇవాళ మహిళల గురించి మాట్లాడుతావా అంటూ ధ్వజమెత్తారు. నా తప్పులు లేని రోజు తాను గడ్డం తీస్తానని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు.. అంతా ఆన్‌లైన్
సీఎం చంద్రబాబు దేవుడు కాబట్టి మీరు ఇవాళ బయటికి వస్తున్నారని, ఐదేళ్లు మమ్మల్ని బయటికి రానివ్వలేదన్నారు. ఆనాడు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్ళారు, ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు.. దయచేసి ఇలాంటి వాళ్ళని వదిలి పెట్టొద్దని సూచన చేశారు.
తాము మాత్రం పేర్ని నానిని వదిలేది లేదన్నారు జేసీ. ఇప్పుడు ఇంటి కొచ్చి కొట్టినా అడిగే దిక్కులేదన్నారు. మీకు సంస్కారం లేదు.. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వీరిని కొద్దిరోజులు కార్యకర్తలకు వదిలిపెట్టి, సీఎం చంద్రబాబు టూర్‌కి వెళ్తే మేలన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్..
నీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావ్..
పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం ఉందా?
మా మీద కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచివాళ్లు కాబట్టే ఊరికే ఉన్నారు
నువ్వు తప్పు చేశావ్… pic.twitter.com/Exk5rjU3R9
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2024