Nani:నేచురల్ స్టార్ నాని.. బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశారు. ఆ తర్వాత ఒక వాణిజ్య ప్రకటన ద్వారా ‘అష్టా చమ్మా’ అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఈరోజు శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీ లో భాగంగా ‘హిట్ 3’ సినిమాను రిలీజ్ చేసి, ఈ సినిమాతో కూడా ఇప్పుడు మంచి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే అలా అష్టా చమ్మా సినిమాతో 2008లో ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన నాని.. ఇప్పటివరకు చాలా సినిమాలలోనే నటించారు. మరి ఆ సినిమాలలో నానికి విజయాన్ని అందించిన చిత్రాలు ఏవి..? ఫ్లాప్ ని మిగిల్చిన చిత్రాలు ఏవి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
2008 – అష్టా చమ్మా :
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో స్వాతి, నాని, అవసరాల శ్రీనివాస్, భార్గవి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా అష్టా చమ్మా.. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాని, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు..
2009 – రైడ్ , స్నేహితుడా :
రమేశ్ వర్మ దర్శకత్వంలో సురేష్ కొండేటి నిర్మించిన రైడ్ మూవీ.. 2009 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మానందం, హేమ, నాని , ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అక్షా పార్ధసాని, తులసి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
స్నేహితుడా.. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో నాని, మాధవి లతా కాంబినేషన్లో సత్య ఎంటర్టైన్మెంట్ పతాకం పై ప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. 2009 ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
2010 – భీమిలి కబడ్డీ జట్టు:
మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఆర్పీ చౌదరి సమర్పణలు నూతన దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రం భీమిలి కబడ్డీ జట్టు. తమిళ చిత్రమైన ‘వెన్నిళ కబడి కుళు’ చిత్రం రీమేక్ గా తెలుగులో రిలీజ్ అయింది. నాని, శరణ్య మోహన్, కిషోర్, తాగుబోతు రమేష్ నటించిన ఈ సినిమా 2010 జూలై 9న విడుదలై సూపర్ హిట్ విజయాన్ని అందించింది.
2011 – అలా మొదలైంది, పిల్ల జమిందార్:
నందిని రెడ్డి దర్శకత్వంలో 2011లో నాని, నిత్యామీనన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అలా మొదలైంది ‘. దర్శకురాలిగా నందిని రెడ్డికి తొలి చిత్రం ఇది. కేఎల్ దామోదర ప్రసాద్.. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా హిట్ గా నిలిచింది.
పిల్ల జమిందార్.. జి అశోక దర్శకత్వంలో నాని హరిప్రియ ప్రధాన పాత్రల్లో 2011 అక్టోబర్ 14న విడుదలైన చిత్రం పిల్ల జమిందార్. ఈ సినిమా నానికి మంచి విజయాన్ని అందించింది.
సెగ – ఫ్లాప్
2012 – ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు:
సాయి కొర్రపాటి నిర్మాణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఈగ. నాని, సుదీప్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. 2012 జూలై 6న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
నాని , సమంత ప్రధాన పాత్రల్లో 2012 డిసెంబర్ 14న విడుదలైన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
2013 డి ఫర్ దోపిడీ – ఫ్లాప్
2014 పైసా – ఫ్లాప్
2015 జెండాపై కపిరాజు – ఫ్లాప్
ఎవడే సుబ్రహ్మణ్యం – హిట్
భలే భలే మగాడివోయ్ – సూపర్ హిట్
2016 కృష్ణ గాడి వీర ప్రేమ గాధ – సూపర్ హిట్
జెంటిల్మెన్ – సూపర్ హిట్
మజ్ను – హిట్
2017 నేను లోకల్ -బ్లాక్ బస్టర్
నిన్ను కోరి – సూపర్ హిట్
మిడిల్ క్లాస్ అబ్బాయి – సూపర్ హిట్
2018 కృష్ణార్జున యుద్ధం – ఫ్లాప్
దేవదాస్ – ఫ్లాప్
2019 నాని గ్యాంగ్ లీడర్ –
జెర్సీ – ఇండస్ట్రీ హిట్
గ్యాంగ్ లీడర్ – సూపర్ హిట్
2020 వి- ఫ్లాప్
2021 టక్ జగదీష్ – ఫ్లాప్
శ్యామ్ సింగరాయ్ – సూపర్ హిట్
2022 అంటే సుందరానికి – సూపర్ హిట్
2023 దసరా – బ్లాక్ బస్టర్
హాయ్ నాన్న – హిట్
2024 సరిపోదా శనివారం – హిట్
2025 హిట్ 3 – పాజిటివ్ టాక్