Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒక్కడిగా వచ్చి సినీ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన కుమార్తెలు నిర్మాణరంగంలో, డిజైనర్ రంగంలో దూసుకుపోతున్నారు. హీరోగా రామ్ చరణ్ ఆయనతో పోటీపడి మరీ సినిమాలు చేస్తుంటే, కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి మరో కొత్త కోణంతో మన ముందుకు వచ్చారు. ఆమె బిజినెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగా కంపౌండ్‌లో పచ్చళ్ల బిజినెస్..
అల్లు రామలింగయ్య కుమార్తెగా, మెగాస్టార్ చిరంజీవి భార్యగా సురేఖగా అందరికీ పరిచయమే. ఆమె కొత్తగా ఫుడ్ బిజినెస్ లో కొత్త కేటగిరీ ని స్టార్ట్ చేసారు. గత సంవత్సరం ఆమె అత్తమ్మ కిచెన్స్ అని పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ని మొదలు పెట్టారు. ఇప్పుడు అందులోనే మరో క్యాటగిరీని జోడించారు. అదే పికిల్స్. వేసవికాలం కావడంతో అందరూ ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకోవడం మొదలు పెడతారు. ఇక కొంతమందికి పచ్చళ్ళు పెట్టుకునే అంత టైం కూడా ఉండదు. అలాంటి వారి కోసం ఆన్లైన్లోనే పచ్చళ్లను అమ్మకానికి పెడుతుంటారు. మరి అలాంటి వ్యాపారంలోకి మెగాస్టార్ కాంపౌండ్ నుంచి సురేఖ రావడం విశేషం. తాజాగా ఆమె కోడలు ఉపాసన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆవకాయ పచ్చడి మాత్రమే కాదు మన సంప్రదాయం అంటూ.. పచ్చడిని జాడీలో పొట్టి దేవుడికి చేస్తున్న సురేఖ ను చూపిస్తూ.. ఆవకాయ పచ్చడితో ఈ సీజన్ లో ముందుకు వస్తున్నారు అని ఆమె ఇన్స్టాల్ లో పోస్ట్ చేశారు. ఆహారం అంటే కేవలం పౌష్టికాహారం మాత్రమే కాదు. మన సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకునే మార్గం అని ఆమె తెలిపింది. కొణిదల వారి ఇంటి పచ్చళ్ళ రుచులు చూడాలనుకునే వారు ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ వెబ్సైట్ లింక్ ని కూడా జత చేశారు.
కెరీర్‌పైన ఫోకస్ పెట్టిన అత్త –కోడలు
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఉపాసన, సురేఖ ఇద్దరు కలిసి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈరోజు పచ్చల బిజినెస్ను అత్తమ్మ కిచెన్లో చేరుస్తున్నట్లు, ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉపాసనకు బొట్టు పెట్టి సురేఖ గారు ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ ఈ వీడియోలో చూపించారు. అందరికీ వేసవి సీజన్ పచ్చళ్ళు అందుబాటులో ఉంటాయి అంటూ ఆర్డర్ చేసుకోండి అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మెగా ఇంటి రుచులను టేస్ట్ చేయాలనుకున్న వారు అత్తమ్మ కిచెన్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర,రామ్ చరణ్ పెద్ది షూటింగ్ పనులలో బిజీగా వున్నారు. ఈ చిత్రాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
?igsh=MTN4OHB4eXNwN3UxaA==