HBD Mohan Babu: ..మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). భారీ బడ్జెట్ తో, అంతకుమించి స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు (Mohanbabu) ‘మహదేవ శాస్త్రి’ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా కన్నప్ప సినిమా నుండి ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ముఖ్యంగా మహాదేవ శాస్త్రి పాత్ర ప్రధానంగా సాగే “ఓం నమః శివాయ” లిరికల్ సాంగ్ గ్లింప్స్ తో పాటు ఈ పాత్ర ప్రధానంగా సాగే పాట చిత్రీకరణ విశేషాలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ లాల్ (Mohan Lal), ప్రభాస్(Prabhas ) వంటి పలువురు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ప్రాణం పెడుతున్న మంచు విష్ణు..
ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తలెత్తినా.. కోర్టు కేసులు అంటూ తండ్రి ,తమ్ముడు పోలీసుల చుట్టూ.. కోర్ట్ ల చుట్టూ తిరిగినా.. అవేవీ తనకు పట్టనట్టుగా ప్రవర్తించాడని నెటిజన్స్ కామెంట్లు చేశారు. కానీ ఆయన ఫోకస్ అంతా కన్నప్ప సినిమా పైన పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమాను చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమా పైనే మంచు విష్ణు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఒక్కొక్కటిగా అప్డేట్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
మెప్పించలేకపోయిన స్టార్ కాస్ట్ ఫస్ట్ లుక్..
ఇకపోతే ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మంచు విష్ణు స్టార్ సెలబ్రిటీలను కరెక్ట్ గా చూపించడంలో కాస తడబడ్డాడేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా ఇందులో మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ దిగ్గజాలు నటిస్తున్నారు. వీరి ఫస్ట్ లోకి సంబంధించిన పోస్టర్లను కూడా రివీల్ చేశారు. కానీ ఒక ప్రభాస్ లుక్ మినహా మిగతా క్యారెక్టర్స్ లుక్ పోస్టర్స్ ఏవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడేమో మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే ఒక వర్గం ప్రేక్షకులు ఈ గ్లింప్స్ పై ప్రశంసలు కురిపిస్తున్న మరొకవైపు మహాదేవ శాస్త్రి పాత్ర మోహన్ బాబుకు అంతగా సెట్ అవ్వలేదని, అందులో ఆయన చాలా వయసైన వ్యక్తిగా కనిపిస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం