BigTV English

Black Dress: మీరు నల్లటి దుస్తులు ఎక్కువ దరిస్తారా? జరిగేది ఇదే.. తెలుసుకోపోతే నష్టపోతారు!

Black Dress: మీరు నల్లటి దుస్తులు ఎక్కువ దరిస్తారా? జరిగేది ఇదే.. తెలుసుకోపోతే నష్టపోతారు!

నలుపు పట్ల ప్రేమ పెరిగిపోతోంది. ఇది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారిపోయింది. నలుపురంగు దుస్తుల్లో కూడా అందంగా కనిపిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. నలుపు అనేది ఒక బలమైన శక్తిగా కూడా భావిస్తూ ఉంటారు. ప్యాంట్, షర్టులు, దుపట్టాలు, చీరలు కూడా నలుపు రంగులో ఎంపిక చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే నలుపు రంగు శక్తితో మిళితమై ఉంటుందని అంటారు. అయితే పురాతన కాలం నుండి కొన్ని నమ్మకాలు నలుపు గురించి చెడుగానే చెబుతున్నాయి. నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదని వివరిస్తున్నాయి.


నలుపు మంచిది కాదా
భిన్న సంస్కృతులలో నలుపు రంగుకు మంచి పేరు లేదు. నలుపు రంగు దుఃఖానికి, విచారానికి, నష్టానికి సూచికగా భావిస్తారు. అంత్యక్రియలలో నలుపు రంగు దుస్తులు వేసుకునే సంప్రదాయం ఇప్పటికీ కొన్నిదేశాల్లో ఉంది. మరణించిన వారి పట్ల దుఃఖాన్ని గౌరవాన్ని సూచించేందుకు కూడా నలుపు రంగు దుస్తులను వేసుకుంటారు. నిజానికి నలుపు రంగు అప్పుడు కూడా ధరించకూడదు. అలాగే తమకు నచ్చని విషయాన్ని తమ ఆహార్యం ద్వారా కూడా చెప్పేవారు ఉంటారు. అలాంటివారు నలుపు రంగు బట్టలు ధరిస్తూ ఉంటారు. ఇప్పటికీ నిరసనలు, ధర్నాలు చేసేవారు నలుపు రంగు బ్యాడ్జీలు ధరించడం, నలుపు రంగు దుస్తులు వేసుకోవడం, నలుపు రంగు మాస్కులను నోటికి కట్టుకోవడం వంటివి చూస్తూ ఉంటాము. నలుపు రంగును అశుభకరమైనదిగా కూడా చెబుతూ ఉంటారు.

నలుపు రంగు దుస్తులు తరచూ ధరించడం వల్ల మీ భావోద్వేగాలు, మనస్తత్వం ప్రభావితం అవుతుందని కూడా అంటూ ఉంటారు. మీకు మీరే దూరం అవుతారని.. అలా ఈ సమాజం నుంచి కూడా దూరమయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు.


నలుపు గురించి ఎన్నో నమ్మకాలు
ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నల్ల పిల్లి ఎదురైతే చాలు… ఆ పని ఇక పూర్తి అవ్వదు అని ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని వెళుతూ ఉంటారు. అలాగే నల్లటి ముసుగు వేసుకున్న వారిని కూడా దొంగల్లాగా చూస్తూ ఉంటారు. నలుపు చీకటితో ముడిపడి ఉంటుంది. అనేక సంప్రదాయాల్లో నలుపు రంగును రహస్యానికి చిహ్నంగా చెబుతారు. అలాగే నలుపు రంగు ప్రమాదంతో ముడిపడి ఉంటుందని అంటారు. అందుకే నలుపు రంగు దుస్తులను, నలుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడకూడదని చెబుతూ ఉంటారు. అలాగే నలుపు రంగు అధికంగా శరీరంపై లేదా ఇంట్లో ఉంటే శక్తుల అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతారు. ఆ వ్యక్తి ప్రతికూల శక్తుల వైపు ఆకర్షించేలా నలుపు రంగు చేస్తుందని అనుకుంటారు.

నలుపు రంగు అనేది చీకటి శకునంగా మారిపోయింది. జీవితంలో జరగకూడదు జరిగేలా చేసేదే నలుపు రంగని కూడా చెప్పుకుంటారు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదని చెప్పడానికి మరొక ప్రత్యేక కారణం కూడా ఉంది.

ఆయుర్వేదంలో నలుపు
నలుపు రంగు సానుకూల, ప్రతికూల శక్తులు రెండింటిని గ్రహిస్తుంది. అందుకే నలుపు రంగు చాలా శక్తివంతమైన రంగుగా పేరు తెచ్చుకుంది. తన లోపల రెండు శక్తులను దాచుకుంటుంది. సున్నితంగా ఉండే వ్యక్తులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే మంచిది. అలాగే ఆయుర్వేద వైద్యం చేసేవారు కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. ఆయుర్వేద వైద్యాన్ని స్వీకరించే వారు కూడా ఈ రంగు బట్టలకు దూరంగా ఉంటే మంచిది.

ప్రతికూల శక్తులు ఉన్నచోట మనం నలుపు రంగు దుస్తులు ధరించి నిలుచుంటే… మన దుస్తులు ఆ ప్రతికూల శక్తులను గ్రహిస్తాయని కూడా చెప్పుకుంటారు. హిందూ అంత్యక్రియలలో దహన సంస్కారాలలో నలుపు రంగు దుస్తులు కాకుండా తెలుపు రంగులు వస్త్రాలు వేసుకోమని చెప్పడానికి కూడా ఇదే కారణంగా భావిస్తారు. ఎందుకంటే దహన సంస్కారాలు చేసే చోట ప్రతికూల శక్తి అధికంగా ఉంటుంది. నలుపు రంగు దుస్తులు వేసుకొని అక్కడికి వెళితే ఆ ప్రతికూల శక్తిని మన శరీరం శోషించుకునే అవకాశం ఉంటుంది.

Also Read: చాణక్య నీతి ప్రకారం.. ఈ విషయాలను భార్యకు అస్సలు చెప్పకూడదట !

రంగులకు ఎంతో ప్రత్యేకత ఉంది. రంగులు ప్రత్యేక కంపనాలను, శక్తులను కలిగి ఉంటాయి. నీలం రంగు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అదే ఎరుపు మిమల్ని కోపంతో ఎర్రబడేలా చేస్తుంది. ఇక గులాబీ రంగు మీలో ప్రేమ ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఆకుపచ్చ మీ భావోద్వేగాలు సానుకూలంగా ఉండేలా జాగ్రత్తగా పడుతుంది.

అయితే నలుపు మాత్రం సానుకూలత, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఇది నెగిటివ్ ప్రకంపనలను సృష్టిస్తుంది. మిమ్మల్ని ఈ రంగు బలహీనంగా మారుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నలుపు రంగు దుస్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే నమ్మకాల ప్రకారం నలుపును శనివారం ధరించవచ్చని చెప్పుకుంటారు. శనివారము లేదా శని దేవుని పూజ చేసే రోజు ఆయనకి ఇష్టమైన నలుపు రంగు దుస్తులు వేసుకుంటే మంచిదని అంటారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×