Shobhita- Naga Chaitanya: అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య (Naga Chaitanya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత (Samantha) తో.. అదే సినిమా ద్వారా పరిచయం ఏర్పడి, ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన నాలుగేళ్లకే విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత రెండేళ్ల పాటు సైలెంట్ అయిన అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) తో లండన్ లోని ఒక హోటల్లో కనిపించి, రూమర్స్ కి ఆజ్యం పోశారు.
ఎంజాయ్ చేస్తున్న కొత్తజంట..
పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టులో శోభిత ధూళిపాల, నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోగా.. డిసెంబర్ లో వివాహం చేసుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక వివాహం తర్వాత ఈ జంట చట్టపట్టలేసుకొని పలు వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు టూర్స్ కి వెళ్తూ పలు దేవాలయాలను కూడా సందర్శిస్తున్నారు. సినిమా ఈవెంట్ అయినా, బర్తడే పార్టీ అయినా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా ఇలా ఎక్కడికైనా సరే జంటగా వెళ్లి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మ్యాగజైన్ కోసం ఫోజ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్..
ఇక అందులో భాగంగానే తాజాగా నాగచైతన్య, శోభిత ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో వోగ్ కపుల్ కవర్ పేజి కి ఫోజులు ఇవ్వడం జరిగింది. ఇక దానికి “లవ్డ్ అప్” అనే క్యాప్షన్ కూడా జోడించారు. ఇక దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్స్ మాత్రం ఈ జంట ఇచ్చిన ఫోజులను చూసి ఏకిపారేస్తున్నారు. సాధారణంగా అమ్మాయిలను సో బ్యూటిఫుల్ అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. ముఖ్యంగా వీరిద్దరూ ఆ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు చూసి.. ఆ ఫోజులు ఏంట్రా బాబు అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. మరి కొంత మంది చైతన్య సో బ్యూటిఫుల్, శోభిత సో హ్యాండ్సం అంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు.ఇంకొంతమంది అచ్చం మగరాయుడిలా శోభిత.. ఆడపిల్లలా నాగచైతన్య భలే ఉన్నారే.. ఇంతకు మీలో ఎవరు భర్త? ఎవరు భార్య? అర్థం కావడం లేదు అంటూ ఏకిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట ఇచ్చిన ఫోజులు చూస్తే వారే కాదు మీరు కూడా ఇలాంటి మాటలు అనడం ఖాయం అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వీరు షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక నాగచైతన్య విషయానికి వస్తే చివరిగా ‘తండేల్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శోభిత కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏది ఏమైనా ఈ జంట ఇప్పుడు వివాహం తర్వాత మరింత జోరు పెంచిందని చెప్పవచ్చు.