Fun Bucket Bhargav: గతేడాది టాలీవుడ్ లో మొత్తం లైంగిక వేధింపుల కేసులే ఎక్కువ నమోదు అయ్యాయి. ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన కేసు జానీ మాస్టర్ ది అయినా.. దానికన్నా ముందు ఒక తెలుగు యూట్యూబర్ కేసు కూడా సెన్సేషన్ సృష్టించింది. యూట్యూబ్ లో ఫన్ బకెట్ భార్గవ్.. కొన్ని కామెడీ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. అతని పేరు కూడా చాలామందికి తెలుసు. నాలుగేళ్ళ క్రితం అతడిపై ఒక మైనర్ బాలిక కుటుంబం లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
14 ఏళ్ళ బాలికతో వీడియోలు చేస్తూ.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడని ఫిర్యాదు చేశారు. ఇక భార్గవ్ పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక బాలికనే కాకుండా చాలామంది అమ్మాయిలను కూడా తాడు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు నిజాలు బయటకు వచ్చాయి.
ఇక 2021 లో ఈ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు ఈ కేసులో కఠినమైన తీర్పును ఇచ్చింది. బాలికను గర్భవతిని చేసిన భార్గవ్ కు 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది. అంతేకాకుండా బాధిత బాలికకు రూ. 4 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Pragya Jaiswal : గ్రీన్ శారీలో బాలయ్య బ్యూటీ అందాలు చూడతరమా..
ఫన్ బకెట్ భార్గవ్.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత ఫన్ బకెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో కామెడీ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. OMG నిత్య, అమ్మాయి – అబ్బాయి లాంటి సిరీస్ లలో కూడా నటించాడు. మొదటి నుంచి కూడా భార్గవ్.. అమ్మాయిలతో చాలా అసహ్యంగా మాట్లాడేవాడిని, అతడితో పనిచేసినా.. ఎప్పుడు ఎక్కడో ఒకచోట తాకడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడని చెప్పుకొచ్చారు.
సదురు బాలికను కూడా చెల్లి అని పిలుస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె బట్టలు మార్చుకుంటూ ఉన్న వీడియోలను తీసి, ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఎవరికైన చెప్తే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి.. బాలికను గర్భవతిని చేశాడు. ఆమెనే కాకుండా మరికొంతమంది అమ్మాయిలను కూడా అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి వారిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించాడని కొంతమంది అమ్మాయిలు చెప్పుకొచ్చారు. ఇక ఇన్నేళ్ల తరువాత భార్గవ్ కు తగిన శిక్ష పడింది. చిన్న వయస్సు , కెరీర్ పాడైపోయింది అని కాకుండా ఇలాంటి పనులు చేసేవారికి ఇలాంటి శాస్తే జరగాలి అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.