HBD Allu Aravindh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలలో అల్లు అరవింద్ (Allu Aravindh) కి ప్రత్యేక స్థానం ఉంది.ఈయన తండ్రి అల్లు రామలింగయ్య (Allu Ramalingaih ) నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇవ్వకుండా.. నిర్మాతగా వచ్చి సక్సెస్ఫుల్ గా తన కెరీర్ ని ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు. అలా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టాలనుకున్న ఈయన.. ఆ తర్వాత తండ్రికి జరిగిన ఓ సంఘటన తెలిసి సినిమాలోకి నటుడిగా అస్సలు రాకూడదని అనుకున్నారట.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు రామలింగయ్య ఓ సీన్ బాగా పండటం కోసం ఎక్కువ టేకులు తీసుకోవడంతో.. డైరెక్టర్ తిట్టారని బాధపడిన అల్లు రామలింగయ్య.. ఇంటికి వచ్చి ఈ విషయాన్ని భార్యతో చెప్పే సమయంలో అరవింద్ ఈ విషయం విని బాధపడి సినిమాలో నటుడిగా చస్తే చేయకూడదు అనుకున్నారట. ఆ తర్వాత వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఈయనకు వచ్చిందట. కానీ ఈ విషయం తండ్రికి చెప్పే కంటే ముందే తండ్రి బ్యాంకాక్ లో అల్లు అరవింద్ కి జాబ్ చూశారట. అయితే ఈ విషయం నచ్చని అల్లు అరవింద్ నేను బిజినెస్ చేస్తాను నాన్న అని చెప్పడంతో సినిమాలో నిర్మాతగా చేరారు. అలా మొదట అల్లు అరవింద్ దాసరి నారాయణరావు డైరెక్షన్లో వచ్చిన “బంట్రోతు భార్య” అనే మూవీకి సహ నిర్మాతగా చేశారు.
అయితే ఈ సినిమా హిట్ అవ్వడంతో నిర్మాత అవ్వాలనే కోరిక ఈయనకు మరింత పెరిగింది.ఇక మొదటి సినిమాతో నిర్మాతగా మారి హిట్ అయ్యాక.. అల్లు అరవింద్ కి నిర్మలని ఇచ్చి పెళ్లి చేశారు..వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. కానీ నలుగురిలో రాజేష్ అనే కొడుకు మరణించాడు. ఇక కొడుకు మరణంతో అల్లు అరవింద్ ఫ్యామిలీ చాలా రోజులు దాని నుండి బయటపడలేక పోయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ బాధాకర సంఘటన నుండి బయటపడ్డారు.
అల్లు అరవింద్, చిరంజీవి లు బావ బావమరిది అనే సంగతి మనకు తెలిసిందే. చిరంజీవిని దగ్గరుండి చూసిన అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖని ఇచ్చి పెళ్లి చేశారు. నిర్మాతగా మారిన అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ బ్యానర్ పెట్టి, చిరంజీవి చేసిన ఎన్నో సినిమాలకు సహ నిర్మాతగా చేశారు. అలా ఈయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అల్లు అరవింద్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. అలాగే మెగా హీరోల సినిమాల వల్ల ఎక్కువ సక్సెస్ కొట్టడంతో మెగా ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కి పేరు వచ్చింది.
అల్లు అరవింద్ కేవలం నిర్మాతగానే కాకుండా ఆయన చేసిన చాలా వ్యాపారాలు సక్సెస్ అయ్యాయి. మాటీవీలో కూడా నాగార్జున (Nagarjuna), మురళి మోహన్ (Murali Mohan)వంటి ప్రముఖులతో కలిసి పెట్టుబడి పెట్టారు. అలాగే కరెక్ట్ టైంలో రూ.2400 కోట్లకి స్టార్ నెట్వర్క్ కి దాన్ని అమ్మేశారు. అలా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఆర్జించడంతో అల్లు అరవింద్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.
బిజినెస్ మైండ్ కలిగిన అల్లు అరవింద్.. కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ కి ఎక్కువ ఆదరణ ఉంది అని తెలిసి ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించి, అందులో ఎన్నో కొత్త షోలు తీసుకువచ్చారు. అలా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు.
అల్లు అరవింద్ కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా పోషించారు. చంటబ్బాయ్, మా ఊళ్లో మహాశివుడు, మహానగరంలో మాయగాడు వంటి సినిమాలు ఈయనకు గుర్తింపునిచ్చాయి. ఈ సినిమాల్లో కామెడీ పాత్రల్లో అల్లు అరవింద్ బాగా నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కమెడియన్ గా నటించారు. కానీ ఇప్పుడైతే ఆయన పూర్తి దృష్టి నిర్మాణ రంగం పైనే ఉంది.ఇక అల్లు అరవింద్ ఏదైనా సినిమాను నిర్మిస్తే ఆయన ఫోకస్ మొత్తం ఆ సినిమా బడ్జెట్ పైనే ఉంటుంది.ఎందుకంటే బడ్జెట్ కి మించి సినిమా తీయడం ఆయనకి ఇష్టం ఉండదు.అందుకే ముందుగా ఎంత బడ్జెట్ అనుకుంటారో ఆ బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేస్తారట.
కానీ మొదటిసారి ఆయన నిర్మాతగా చేసిన ‘మగధీర’ సినిమాకి బడ్జెట్ ఎక్కువైంది. అయితే బడ్జెట్ ఎక్కువైనా కూడా అల్లు అరవింద్ కి లాభమే కలిగింది. ఎందుకంటే మగధీర సినిమాకి పెట్టిన పెట్టుబడి కంటే మూడు రెట్ల లాభాలు వచ్చాయి.
అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో ఉంటూనే గీత ఆర్ట్స్ -2 అనే బ్యానర్ ని కూడా స్థాపించారు. ఈ బ్యానర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గీతా గోవిందం, 18 పేజెస్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అలాగే ఇప్పటివరకు అల్లు అరవింద్ తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 55 సినిమాలకు నిర్మాతగా చేశారు. ఇప్పటివరకు ఈయన చేసిన అన్ని సినిమాలు కూడా హిట్టే అయ్యాయి.