Jio 5.5G : ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా 5.5G నెట్‌వర్క్‌ను ఆవిష్కరించింది. ఈ నెట్వర్క్ 10Gbps వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందిస్తోందని తెలిపింది.
దేశంలోనే టాప్ టెలికాం సంస్థగా సేవలు అందిస్తున్న ప్రముఖ టెలికాం నెట్వర్క్ జియో. ఈ సంస్థ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకురావడమే కాకుండా సరికొత్త మార్పులు చేస్తుంది. అయితే ఇప్పుడు మరో ముందడుగు వేసి జియో 5.5G నెట్‌వర్క్ ను తీసుకువచ్చింది.
జియో 5.5G నెట్‌వర్క్ ఏంటంటే –
జియో ఇప్పటికే ఉన్న 5G నెట్వర్క్ ను మరింత మెరుగు పరుస్తూ 5.5G నెట్వర్క్ ను తీసుకొచ్చింది. ఈ నెట్వర్క్ నెట్ స్పీడ్ మరింత మెరుగుపడటమే కాకుండా.. అధునాతన ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ను సైతం అనుసంధానం చేస్తుంది. ఇంకా ఒకే టైంలో టవర్ కనెక్షన్స్ కోసం మూడు నెట్వర్క్ ను సైతం ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది. స్పీడ్ నెట్వర్క్ కనెక్షన్ కావాలనుకునే వారికి ఆటంకాలు తక్కువగా ఉంటాయి. ఇక స్థిరమైన కనెక్షన్స్ ను సైతం అందిస్తూ.. స్ట్రీమింగ్, గేమింగ్, రిమోట్ వర్క్ వంటి వాటిలో యూజర్స్ అనుభవాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది.
OnePlus 13 సిరీస్‌లో స్పెషల్ ఫీచర్ –
నిజానికి వన్ ప్లస్ 13 సిరీస్ జియో సపోర్ట్ తోనే లాంఛ్ అయింది. ఇది 5.5G సర్వీస్ కు సపోర్ట్ చేసే ఫస్ట్ స్మార్ట్ ఫోన్. ఈ సిరీస్ లో గ్యాడ్జెట్స్ జియో అధునాతన నెట్‌వర్క్స్ తో ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేస్తాయి. నిజానికి OnePlus 13 లాంఛ్ టైం లోనే ఈ స్మార్ట్ ఫోన్ 5.5G తో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఇందులో డౌన్‌లోడ్ వేగం 277.78 Mbps వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. అయితే 3CC కాంపోనెంట్ క్యారియర్‌లో, వేగం 1,014 Mbps కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.
5G తో పోలిస్తే 5.5G ఎలా బెటర్..?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5G నెట్వర్క్ తో పోలిస్తే 5.5G నెట్వర్క్ టెక్నాలజీలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుంది. బెటర్ పర్ఫామెన్స్ ను చూపించడమే కాకుండా బెస్ట్ నెట్వర్క్ ను సైతం అందిస్తుంది. హై స్పీడ్ డేటాను సైతం అందిస్తూ యూజర్స్ కు నెట్వర్క్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంది.
• స్పీడ్ – 10Gbps వరకు డౌన్‌లోడ్‌లు, 1Gbps వరకు అప్‌లోడ్ సదుపాయం కలదు.
• బెస్ట్ కనెక్టివిటీ – ఎక్కువ టవర్స్ కు ఓకే టైంలో కనెక్టివిటీని అందిస్తుంది.
• నెట్వర్క్ ఆటంకాలకు చెక్ – బెస్ట్ నెట్వర్క్ స్పీడ్ ను అందిస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా డేటాను సైతం అందిస్తుంది
• బెస్ట్ నెట్వర్క్ క్రెడిబిలిటీ : ఓకే టైంలో బెస్ట్ కనెక్టివిటీని అందించడమే కాకుండా స్థిరమైన కనెక్షన్ ను అందిస్తోంది
నేటి కాలంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ కొత్త నెట్వర్క్ ను తీసుకొస్తున్నాయి. జియో తీసుకొచ్చిన ఈ 5.5G నెట్వర్క్ మిగిలిన టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందనే చెప్పాలి.
ALSO READ : వొడాఫోన్ ఐడియా నుంచి 5G సేవలు.. జియో కంటే మరింత చౌకగా..